Terror Threat Call: ప్రధాని ప్రయాణ విమానంపై ఉగ్రదాడి బెదిరింపు కాల్.. తర్వాత ఏమైందంటే..
ABN , Publish Date - Feb 12 , 2025 | 12:45 PM
దేశంలో ఫేక్ కాల్స్ భయాందోళన మళ్లీ వచ్చింది. ఈసారి ఏకంగా దేశ ప్రధానమంత్రి ప్రయాణించే నరేంద్ర మోదీ విమానంపై ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని ఫోన్ వచ్చింది. అయితే తర్వాత ఏమైందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

చాలా రోజుల తర్వాత మళ్లీ ఫేక్ కాల్స్ భయాందోళన మొదలైంది. ఇది వరకు దేశంలోని పలు విమానాశ్రయాల్లో బాంబులు పెట్టారని పలువురు ఫోన్ కాల్స్ చేయడంతో అనేక ఫ్లైట్స్ ఆలస్యంగా ప్రయాణించిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు కొన్ని స్కూల్స్, ఆస్పత్రుల విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఈ క్రమంలోనే తాజాగా మళ్లీ ఇదే అంశం వెలుగులోకి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Modi) అధికారిక విదేశీ పర్యటనకు ముందు, ఆయన ప్రయాణించనున్న విమానంపై ఉగ్రవాద దాడి జరిగే అవకాశం ఉందని బెదిరింపు కాల్ వచ్చింది.
పోలీసులు అప్రమత్తం..
ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫిబ్రవరి 11, 2025న ఈ సమాచారం వచ్చింది. ఈ కాల్ వచ్చిన వెంటనే ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. దీనిని ఎవరు చేశారనే సమాచారం తెలుసుకుని, చెంబూర్‌కు చెందిన వ్యక్తిని అరెస్టు చేశారు. ఆ క్రమంలో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో ఈ వ్యక్తి కాల్‌లో ప్రధానమంత్రి మోదీ ప్రయాణించనున్న విమానంపై ఉగ్రవాద దాడి జరిగే అవకాశం ఉందని హెచ్చరించినట్లు చెప్పాడు. అయితే ఆ వ్యక్తిచే ఎవరైనా కావాలని ఫోన్ చేయించారా లేదా ఆకతాయి చేష్టలతో ఫోన్ చేశాడా అనే వివరాలు తెలియాల్సి ఉంది.
నెటిజన్ల ఆగ్రహం...
ఈ క్రమంలో అరెస్టు చేసిన వ్యక్తిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, విచారణ కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తేలాల్సి ఉంది. బెదిరింపు కాల్ నేపథ్యంలో ముంబై పోలీసులు భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనపై పోలీసులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. దీంతోపాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమాచారం తెలిసిన నెటిజన్లు ఇలాంటి పేక్ కాల్స్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. మళ్లీ ఇలాంటివి చేయకుండా వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి:
Ayodhya Chief Priest: అయోధ్య ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్ కన్నుమూత
Court: భార్యతో ఇష్టం లేకుండా అసహజ శృంగారం నేరం కాదు.. కోర్టు సంచలన తీర్పు
Narendra Modi: ఇన్వెస్ట్ మెంట్స్ గురించి మోదీ కీలక వ్యాఖ్యలు.. ఇదే సరైన సమయమని వెల్లడి
New Delhi: ఇళ్ల ధరల పెరుగుదలలో టాప్ 15 నగరాలు.. ఇండియా నుంచి..
BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్
EPFO: ఈ వినియోగదారులకు అలర్ట్.. మీ బ్యాంక్ ఖాతా లింక్ చేశారా లేదా..
Kumbh Mela 2025: కుంభమేళా ట్రాఫిక్ అప్‌డేట్స్ ఇలా తెలుసుకోండి.. సులభంగా వెళ్లండి..
Next Week IPOs: ఈ వారం కీలక ఐపీఓలు.. మరో 6 కంపెనీల లిస్టింగ్
Read More Business News and Latest Telugu News