Tejaswi Yadav: సీఎం అభ్యర్థిగా ప్రకటించుకున్న తేజస్వి.. వేదికపై రాహుల్
ABN , Publish Date - Aug 30 , 2025 | 07:30 PM
ర్యాలీలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై తేజస్వి విమర్శలు గుప్పించారు. నితీష్ కాపీ క్యాట్ ముఖ్యమంత్రి అని, ఆయన విధానాల్లో అనుకరణే తప్ప ఒరిజినాలిటీ లేదన్నారు. తన విధానాలు, ప్రకటనలను నితీష్ కాపీ కొడుతున్నారని చెప్పారు.
పాట్నా: బిహార్‌లో విపక్ష మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నేత తేజస్వి యాదవ్ (Tejaswi Yadav) తన పేరును ప్రకటించుకున్నారు. అరా (Ara)లో శనివారంనాడు జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi), సమాజ్‌వాదీ పార్టీ (SP) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సమక్షంలో తేజస్వి ఈ ప్రకటన చేశారు. సీఎం అభ్యర్థిత్వంపై వేదికపై ఉన్న రాహుల్ గాంధీ ఎలాంటి కామెంట్ చేయకుండా మౌనంగా ఉండిపోయారు. మహాకూటమిలో కాంగ్రెస్, ఆర్జేడీ భాగస్వాములుగా ఉన్నాయి.
కాపీ క్యాట్ సీఎం
ర్యాలీలో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై తేజస్వి విమర్శలు గుప్పించారు. నితీష్ కాపీ క్యాట్ ముఖ్యమంత్రి అని, ఆయన విధానాల్లో అనుకరణే తప్ప ఒరిజినాలిటీ లేదన్నారు. తన విధానాలు, ప్రకటనలను నితీష్ కాపీ కొడుతున్నారని చెప్పారు. సీఎం కావాలనే తన మనోగతాన్ని ఆవిష్కరిస్తూ.. ఒరిజనల్ చీఫ్ మినిస్టర్‌ను మీరు కోరుకుంటున్నారా? డూప్లికేట్ సీఎంను కోరుకుంటున్నారా అని ర్యాలీకి హాజరైన ప్రజానీకాన్ని తేజస్వి ప్రశ్నించారు.
ఎలక్షన్ కమిషన్‌పై విసుర్లు
'ఎలక్షన్ కమిషన్ ఇంకెంతమాత్రం ఎలక్షన్ కమిషన్‌గా ఉండటం లేదు. అది గోడి ఆయోగ్‌గా మారింది. బీజేపీ పార్టీ సెల్‌గా, పార్టీ కార్యకర్తగా పనిచేస్తోంది' అని తేజస్వి అన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, ఓటు పరిరక్షణ కోసం, ప్రజల ఉనికిని కాపాడుకోవడం కోసం రాహుల్ గాంధీతో కలిసి తామంతా ఓటర్ అధికార్ యాత్రలో పాల్గొంటున్నట్టు చెప్పారు. గ్రౌండ్ లెవెల్‌లో తాము గ్రామీణ ప్రాంతాల్లోనూ పర్యటించామని, ఎలక్షన్ కమషన్ విశ్వసనీయత ఇక ముగిసినట్టేనని అన్నారు.
ఇవి కూడా చదవండి..
మాజీ ఎమ్మెల్యే పెన్షన్‌కు దరఖాస్తు చేసుకున్న జగదీప్ ధన్‌ఖడ్
చొరబాట్ల స్పెషలిస్ట్ బాగూఖాన్ ఖేల్ ఖతం.. ఎన్‌కౌంటర్‌లో హతం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి