Share News

Vijay Rally: విజయ్ ర్యాలీ తొక్కిసలాటలో గుండెలు పిండేసే దృశ్యాలెన్నో..

ABN , Publish Date - Sep 28 , 2025 | 12:34 PM

తమిళ హీరో విజయ్ నిన్న కరూర్ లో తీసిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి ఎన్నో విషాద ఘటనలు. తమ బిడ్డల్ని చేతుల్లోకి తీసుకుని ఆస్పత్రిలోకి బోరున ఏడ్చుకుంటూ వెళ్తున్న దృశ్యాలు గుండెల్ని పిండేస్తున్నాయి.

Vijay Rally:  విజయ్ ర్యాలీ తొక్కిసలాటలో గుండెలు పిండేసే దృశ్యాలెన్నో..
Vijay Rally

ఇంటర్నెట్ డెస్క్: తమిళ హీరో విజయ్ నిన్న తమిళనాడులోని కరూర్ పట్టణంలో తీసిన తన రాజకీయ పార్టీ ర్యాలీలో తొక్కిసలాట జరిగి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 39కి చేరింది. ఇందులో ముక్కుపచ్చలారని చిన్నారులు సైతం ఉన్నారు. ఈ క్రమంలో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తమ బిడ్డలు విగత జీవులుగా మారడాన్ని ఆ తల్లిదండ్రులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.


Tamil-Nadu-Stampade.jpg

తొక్కిసలాట అనంతరం తమ బిడ్డల్ని హుటాహుటీన చేతుల్లోకి తీసుకుని ఆస్పత్రిలోకి బోరున ఏడ్చుకుంటూ వెళ్తున్న దృశ్యాలు గుండెల్ని పిండేస్తున్నాయి. అప్పటికే ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల దగ్గర తీవ్ర వేదనతో కన్న బిడ్డల్ని చివరి ముద్దులు పెట్టుకుంటున్న సన్నివేశాలు ఆస్పత్రి వర్గాల్ని సైతం కన్నీరు కార్పిస్తున్నాయి.


Tamil-Nadu-Stampade-2.jpgకాగా, మృతుల కుటుంబాలకు 20 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడ్డ వారికి రెండు లక్షలు చొప్పున విజయ్ ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. నా హృదయం ముక్కలైందని, భరించలేని బాధలో ఉన్నానని విజయ్ ఘటన గురించి ఇప్పటికే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి..

చొరబాట్లకు సిద్ధంగా సరిహద్దుల్లో ఉగ్రవాదులు.. బీఎస్ఎఫ్ ఐజీ వెల్లడి

ఇక్కడున్నది ఎవరో మౌలానా మర్చిపోయినట్టున్నారు... యోగి స్ట్రాంగ్ వార్నింగ్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 28 , 2025 | 01:55 PM