Assam Encounter: కోక్రాఝార్ ఎన్‌కౌంటర్‌లో కీలక మావోయిస్టు హతం
ABN , Publish Date - Oct 25 , 2025 | 08:05 PM
రోహిత్ ముర్ము జాడను తెలుసుకునేందుకు జార్ఖాండ్ పోలీసు బృందం ఇటీవల అసోం వచ్చింది. స్థానిక అధికారుల సమన్వయంతో గాలింపు జరుపుతుండగా తాజా ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది.
గౌహతి: అసోం (Assam)లోని కోక్రాఝార్ (Kokrajhar) జిల్లాలో శనివారం ఉదయం ఎన్‌కౌంటర్ (Encounter) చోటుచేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టు మృతిచెందాడు. అతన్ని కోక్రాఝార్ నివాసి రోహిత్ ముర్ము (Rohit Murmu)గా గుర్తించారు. ఈనెల 23న కోక్రాఝార్ సమీపంలోని రైల్వే ట్రాక్‌ను ఐఈడీతో పేల్చేసిన ఘటనలో రోహిత్ ముర్ము కీలక నిందితుడని పోలీసులు తెలిపారు. గత ఏడాది జార్ఖాండ్‌లో ఇదే తరహా పేలుడు ఘటనలోనూ అతను నిందితుడని చెప్పారు. ఘటనా స్థలిలో ఒక పిస్తోలు, గ్రనేడ్, వోటర్ ఐడీ కార్డు, జార్ఖాండ్ సర్కార్ జారీ చేసిన ఆధార్ కార్డును స్వాధీనం చేసుకున్నారు.
రోహిత్ ముర్ము జాడను తెలుసుకునేందుకు జార్ఖాండ్ పోలీసు బృందం ఇటీవల అసోం వచ్చింది. స్థానిక అధికారుల సమన్వయంతో గాలింపు జరుపుతుండగా తాజా ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది.
జార్ఖాండ్‌లో ర్వైలే ట్రాక్‌ను పేల్చివేసిన రోహిత్ వర్మ అక్కడి నుంచి పారిపోయి అసోంకు వచ్చినట్టు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్‌పీ) పుష్పరాజ్ సింగ్ తెలిపారు. జార్ఖాండ్‌లో అతని పేరు రోహిత్ వర్మ అని, అసోంలో ఐపిల్ ముర్ముగా అతను చెప్పుకునేవాడని అన్నారు. మావోయిస్టుతో సన్నిహిత సంబంధాలు కలిగి ప్రస్తుతం అచేతనంగా ఉన్న నేషనల్ సంతాల్ లిబరేషన్ ఆర్మీ (ఎన్ఎస్ఎల్ఏ)తో ముర్ముకు సంబంధాలున్నట్టు విచారణలో తేలింది. ఎన్ఎస్ఎల్ఏ ఆయుధాలు విడిచి లొంగిపోగా, ముర్ము లొంగిపోయేందుకు ఇష్టపడలేదు. ఆ తర్వాత జార్ఖాండ్‌కు పారిపోయి చీలక గ్రూపును ఏర్పాటు చేసి దానికి కమాండర్ అయినట్టు తెలుస్తోంది. క్రమంగా మావోయిస్టుల గ్రూపులతో సంబంధాలు పెట్టుకుని తన నెట్‌వర్క్ విస్తరించాడని, 2015 నుంచి జార్ఖాండ్‌లో విచ్ఛిన్నకర కార్యకలాపాలకు పాల్పడుతూ వచ్చాడని తెలిసింది.
ఇవి కూడా చదవండి..
ఐదేళ్లూ సిద్ధరామయ్యే సీఎం.. యతీంద్ర స్పష్టత
బీఎంసీ ఎన్నికలపై బీజేపీ కసరత్తు.. 150 సీట్లలో పోటీ యోచన
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి