Share News

Supreme Court: ఆ బంగ్లా తక్షణం ఖాళీ చేయండి.. మాజీ సీజేఐకి సుప్రీంకోర్టు నోటీసులు

ABN , Publish Date - Jul 06 , 2025 | 12:04 PM

ప్రధాన న్యాయమూర్తి బంగ్లాను తక్షణం ఖాళీ చేయాలని మాజీ సీజేఐ చంద్రచూడ్‌కి సుప్రీంకోర్టు ఆదివారం నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ఉంటున్న నివాసాన్ని తక్షణం స్వాధీనం చేసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు లేఖ రాసింది.

Supreme Court: ఆ బంగ్లా తక్షణం ఖాళీ చేయండి.. మాజీ సీజేఐకి సుప్రీంకోర్టు నోటీసులు
Supreme Court

ఢిల్లీ: ప్రధాన న్యాయమూర్తి బంగ్లాను తక్షణం ఖాళీ చేయాలని మాజీ సీజేఐ చంద్రచూడ్‌కి (Chandrachud) సుప్రీంకోర్టు (Supreme Court) ఇవాళ(ఆదివారం) నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ఉంటున్న నివాసాన్ని తక్షణం స్వాధీనం చేసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు లేఖ రాసింది. ప్రధాన న్యాయమూర్తి ఉండే అధికారిక నివాసాన్ని మాజీ సీజేఐ చంద్రచూడ్ తక్షణం ఖాళీ చేయాలని సుప్రీంకోర్టు అల్టిమేటం జారీ చేసింది.


ఆ నివాసాన్ని ఖాళీ చేయడంతో పాటు కోర్టు హౌసింగ్ పూల్‌కు అందజేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎలాంటి జాప్యం లేకుండా తక్షణం చంద్రచూడ్ ఉంటున్న నివాసాన్ని స్వాధీనం చేసుకోవాలని కేంద్ర గృహా, పట్టణాభివృద్ధి శాఖకు సుప్రీంకోర్టు పరిపాలనా విభాగం లేఖ రాసింది. తన కుమార్తెలకు ఉన్న ప్రత్యేక ఇబ్బందుల కారణంతోనే.. తాను ఆ నివాసం ఖాళీ చేయడం ఆలస్యం అయిందని జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. గడువు ముగిసినా అధికారిక నివాసంలో ఉన్నారంటూ మాజీ ప్రధాన న్యాయమూర్తి ఉంటున్న ఇంటిని తక్షణ స్వాధీనానికి సుప్రీంకోర్టు లేఖ రాయడం అసాధారణమని న్యాయవర్గాలు చెబుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

పేషంట్లమంటూ వచ్చి డాక్టర్‌ను కాల్చేశారు..

మళ్లీ ఏకమైన ఠాక్రే సోదరులు

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 06 , 2025 | 12:20 PM