Shirdi Saibaba Prasad: షిరిడీలో ప్రసాదాలు బంద్.. కారణం ఇదే..
ABN , Publish Date - May 11 , 2025 | 10:39 AM
Shirdi: షిరిడీ సాయి బాబా భక్తులకు బ్యాడ్ న్యూస్. బాబా దర్శనం కోసం వెళ్లే భక్తులు ఇది తెలుసుకోవాలి. షిరిడీలో ప్రసాదాలను నిలిపివేశారు. అసలు ప్రసాదాలను ఎందుకు బంద్ చేశారు అనేది ఇప్పుడు చూద్దాం..

షిరిడీ సాయిబాబా దర్శనం కోసం వెళ్లే వారికి ఓ బ్యాడ్ న్యూస్. షిరిడీలో ప్రసాద వితరణను నిలిపివేశారు. ప్రసాదాలతో పాటు పూలదండలు, బొకేలు, శాలువాలను కూడా ఆలయంలోకి అనుమతించబోమని షిరిడీ సాయిబాబా ట్రస్ట్ వెల్లడించింది. దీంతో అసలు ట్రస్ట్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది. దీనికి కారణం ఏంటి.. అంటూ ఆలోచనల్లో పడ్డారు భక్తులు. మరి.. సాయిబాబా ట్రస్ట్ తీసుకున్న సంచలన నిర్ణయానికి అసలు రీజన్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..
ఆ ఆలయంలోనూ..
షిరిడీ ఆలయానికి మే 2వ తేదీన బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. దీనికి తోడు భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో సాయిబాబా ఆలయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. దీంతో పాటు టెంపుల్ కాంప్లెక్స్‌లోకి శాలువాలు, బొకేలు, పూలదండల్ని అనుమతించొద్దని షిరిడీ ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది. ఆలయంలోకి వచ్చే భక్తుల్ని క్షుణ్నంగా తనిఖీలు చేయనున్నారు. ఆ తర్వాతే టెంపుల్‌లోకి అనుమతించనున్నారు. ఇందుకు అంతా సహకరించాలని ట్రస్ట్ కోరింది. కాగా, సాయిబాబా గుడితో పాటు మహారాష్ట్రలోని మరికొన్ని ప్రసిద్ధ ఆలయాల్లోనూ ప్రసాద వితరణను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇందులో ముంబైలోని సిద్ధివినాయక టెంపుల్ కూడా ఉంది. పైఆలయాల్లో బొకేలు, పూలదండలు, శాలువాలను కూడా అనుమతించరు. షిరిడీ ఆలయంలో మే 11వ తేదీ నుంచి ఈ రూల్స్ అమలులో ఉండనున్నాయి. దేశంలో, రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడే వరకు నిబంధనలు అమల్లో ఉంటాయి. ఆ తర్వాత ఎప్పటిలాగే ప్రసాద వితరణ కొనసాగుతుంది. ఒకవేళ సిచ్యువేషన్స్‌లో మార్పులు లేకపోతే ఇంకొన్నాళ్లు రూల్స్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇవీ చదవండి:
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి