China President: అమోరికాకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వార్నింగ్..
ABN , Publish Date - Sep 01 , 2025 | 03:37 PM
న్యాయమైన, సహేతుకమైన ప్రపంచ పాలన వ్యవస్థను నిర్మించడాన్ని అందరూ కృషి చేయాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తెలిపారు. సభ్య దేశాలు SCO సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడం, వనరుల ఇన్‌పుట్, సామర్థ్య నిర్మాణాన్ని పెంచడం, నిర్ణయాలు మరింత శాస్త్రీయంగా తీసుకోవడంపై దృష్టి సారించాలని పేర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: రెండవ ప్రపంచ యుద్ధ చరిత్రపై సరైన దృక్పథాన్ని ప్రోత్సహించాలని, ఘర్షణ, బెదిరింపులను నిరోధించాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. చైనాతో సహా ఇతర దేశాలపై ఏకపక్షంగా సుంకాలు విధించడంపై అమెరికాకు ఉద్దేశించి ఆయన మాట్లాడారు. SCO శిఖరాగ్ర సమావేశంలో ఆయన అమెరికాపై పరోక్షంగా ఆరోపణలు చేశారు. షాంఘై సహకార సంస్థ(SCO) సభ్య దేశాలు సమానమైన, క్రమబద్ధమైన ఆర్థిక ప్రపంచీకరణ కోసం కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలో న్యాయాన్ని, ధర్మాన్ని సమర్థించాలని సూచించారు. ఐక్యరాజ్యసమితి ప్రధానాంశంగా ఉన్న అంతర్జాతీయ వ్యవస్థను సమర్థించాలన్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రధానాంశంగా ఉన్న బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థను ప్రోత్సహించాలని ఉత్ఘాటించారు.
న్యాయపరమైన ప్రపంచ పాలన వ్యవస్థను నిర్మించడాన్ని అందరూ కృషి చేయాలని జిన్‌పింగ్ తెలిపారు. సభ్య దేశాలు SCO సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడం, వనరుల ఇన్‌పుట్, సామర్థ్య నిర్మాణాన్ని పెంచడం, నిర్ణయాలు మరింత శాస్త్రీయంగా తీసుకోవడంపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. అప్పుడే వాటి చర్యలు, సమర్థవంతంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. SCO శిఖరాగ్ర సమావేశంలో Xi అమెరికాకు పరోక్షంగా ఆరోపణలు చేశారు. భద్రతా, బెదిరింపులు సవాళ్లను పరిష్కరించే ఇంటిగ్రేటెడ్ సెంటర్ మాదకద్రవ్యాల నియంత్రణ కేంద్రాన్ని ప్రారంభించడాన్ని వేగవంతం చేయాలని సూచించారు. సభ్య దేశాల భద్రత, ఆర్థిక సహకారానికి బలమైన మద్దతును అందించడానికి వీలైనంత త్వరగా షాంఘై సహకార సంస్థ అభివృద్ధి బ్యాంకును ఏర్పాటు చేయాలి ఆయన చెప్పుకొచ్చారు.
ఒకరికొకరు తేడాలను గౌరవించి, వ్యూహాత్మక కమ్యూనికేషన్‌ను కొనసాగించాలని జిన్‌పింగ్ వివరించారు. సామూహిక ఏకాభిప్రాయాన్ని నిర్మించి, ఐక్యత సహకారాన్ని బలోపేతం చేయాడానికి సహకారాన్ని విస్తరించాలని సూచించారు. ప్రతి దేశం ఆర్థిక సంస్కరణలను ఉపయోగించుకోవాలన్నారు. శాంతి, స్థిరత్వం, అభివృద్ధి శ్రేయస్సును ప్రోత్సహించే ఉమ్మడి బాధ్యతను SCO సభ్య దేశాలు తీసుకోవాలని ఆయన కోరారు.
ఇవి కూడా చదవండి:
భారత యుద్ధ నౌకలన్నీ స్వదేశంలోనే తయారవుతాయి: రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
సెప్టెంబర్ నెలాఖరు కల్లా ఎయిర్ ఫోర్స్ చేతికి రెండు తేజస్ ఎమ్‌కే-1ఏ ఫైటర్ జెట్స్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి