Share News

PM Modi: నేడు బిహార్, బెంగాల్ రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన..

ABN , Publish Date - Aug 22 , 2025 | 08:07 AM

8.15 కిలోమీటర్ల పొడవైన ఆంటా - సిమారియా బ్రిడ్జిని, గంగానదిపై 1.86 కిలోమీటర్ల ఆరు లైన్ల బ్రిడ్జిని కూడా ప్రధాని మోదీ ఇవాళ(శుక్రవారం) ప్రారంభిస్తారు. గంగానదిపై ఆరు లైన్ల బ్రిడ్జి కారణంగా మొకామా నుంచి బెగుసరాయ్‌కి డైరెక్ట్ కనెక్టివిటీ ఏర్పడనుంది.

PM Modi: నేడు బిహార్, బెంగాల్ రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన..
PM Modi

బిహార్: నేడు బిహార్‌, బెంగాల్‌ రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. పర్యటన సందర్భంగా రెండు రాష్ట్రాల్లో రూ.18 వేల కోట్ల ప్రాజెక్టులను ఆయన ప్రారంభించనున్నారు. బీహార్‌లో రూ. 13 వేల కోట్ల ప్రాజెక్టులను, పశ్చిమ బెంగాల్‌లో రూ.5,200 కోట్ల ప్రాజెక్టులను ఆరంభించనున్నారు. గయ, ఢిల్లీల మధ్య తిరిగే అమ్రిత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. వైశాలి, కోధర్మల మధ్య తిరిగే బుద్ధిస్ట్ సర్క్యూట్ రైళ్లను మోదీ ప్రారంభిస్తారు.


అంతేకాకుండా 8.15 కిలోమీటర్ల పొడవైన ఆంటా - సిమారియా బ్రిడ్జిని, గంగానదిపై 1.86 కిలోమీటర్ల ఆరు లైన్ల బ్రిడ్జిని కూడా ప్రధాని మోదీ ఇవాళ(శుక్రవారం) ప్రారంభిస్తారు. గంగానదిపై ఆరు లైన్ల బ్రిడ్జి కారణంగా మొకామా నుంచి బెగుసరాయ్‌కి డైరెక్ట్ కనెక్టివిటీ ఏర్పడనుంది. ఈ బ్రిడ్జీల నిర్మాణం కోసం ప్రభుత్వం 18వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు బీహార్ ప్రభుత్వం చెబుతోంది. ఈ బ్రిడ్జి కారణంగా ఆ ఏరియాల్లో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. ఉత్తర బీహార్ అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావిస్తుంది.


అయితే బిహార్‌లో రెండు రోజుల క్రితం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార్ యాత్రలో.. అపశృతి చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ కారు కిందపడి ఓ పోలీస్ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే.. బీజేపీ రాహుల్‌పై తీవ్ర విమర్శలు చేస్తుంది. ఈ తరుణంలో.. బిహార్‌లో ప్రధాని మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.


ఇవి కూడా చదవండి..

అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?

మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్

Updated Date - Aug 22 , 2025 | 08:07 AM