Bihar Elections: లాలూ ఇచ్చిన టిక్కెట్లను వెనక్కి తీసుకున్న తేజస్వి.. ఆసక్తికర పరిణామం
ABN , Publish Date - Oct 14 , 2025 | 05:49 PM
'ఇండియా' కూటమి భాగస్వాములకు సీట్ల కేటాయింపుపై ఆర్జేడీ మరికొద్ది గంటల్లోనే ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. రఘోపూర్ నియోజకవర్గం నుంచి తేజస్వి బుధవారంనాడు నామినేషన్ వేయనున్నట్టు చెబుతున్నారు.
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Assembly Elections) విపక్ష 'ఇండియా' కూటమి (INDIA Alliance) సీట్ల పంపకాల వ్యవహారం ఇంకా తేలకుండానే కూటమి ప్రధాన భాగస్వామిగా ఉన్న ఆర్జేడీ (RJD) పలువురికి టిక్కెట్లు ఇవ్వడం, ఆ తర్వాత కొద్దిసేపటికే దానిని నిలిపి వేసి, ఇచ్చిన టిక్కెట్లను వెనక్కి తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. వివరాల్లోకి వెళ్తే..
కోర్టుకు హాజరయ్యేందుకు ఢిల్లీకి వెళ్లిన లాలూప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవి సోమవారం సాయంత్రం తిరిగి బిహార్ చేరుకున్నారు. 10, సర్క్యులర్ రోడ్డులోని రబ్రీ బంగ్లా వద్ద అప్పటికే పెద్దఎత్తున టిక్కెట్ ఆశావహలు చేరుకున్నారు. లాలూ దంపతులు వచ్చిన కొద్దిసేపటికే పలువురు ఆశావహుల చేతికి పార్టీ సింబల్స్ రావడం, వారి ముఖాలు సంతోషంతో వెలిగిపోవడం కనిపించింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఢిల్లీ నుంచి వచ్చిన తేజస్వి యాదవ్ జరిగిన విషయం తెలుసుకుని అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కూటమి భాగస్వాముల మధ్య సీట్ల కేటాయింపులు ప్రక్రియ పూర్తి కాకుండానే పార్టీ అభ్యర్థుల ఫోటోలు, వీడియోలు బయటకు వస్తే భాగస్వామ్య పక్షాలు ఏమనుకుంటారని లాలూకు నచ్చచెప్పి టిక్కెట్ల పంపిణీని నిలిపివేయించారు. అప్పటికే టిక్కెట్లు అందుకున్న నేతలను సాంకేతిక కారణాల వల్ల వాటిని తిరిగి ఇచ్చేయాల్సిందిగా తేజస్వి ఆదేశించారు.
బుధవారం నామినేషన్
కాగా, 'ఇండియా' కూటమి భాగస్వాములకు సీట్ల కేటాయింపుపై ఆర్జేడీ మరికొద్ది గంటల్లోనే ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. రఘోపూర్ నియోజకవర్గం నుంచి తేజస్వి బుధవారంనాడు నామినేషన్ వేయనున్నట్టు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
71 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా విడుదల
ఐపీఎస్ అధికారి ఆత్మహత్యపై నిష్పాక్షిక విచారణ జరపాలి.. రాహుల్ డిమాండ్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి