Vikram Doraiswami: పాక్ బండారం బయటపెట్టిన భారత్.. మొహం ఎక్కడ పెట్టుకుంటారో..
ABN , Publish Date - May 09 , 2025 | 01:16 PM
India Pakistan War: ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారత్‌పై సంధిస్తున్న పాకిస్థాన్ నిజస్వరూపం మరోమారు బయటపడింది. పక్కా ఆధారాలతో ప్రపంచం ముందు దాయాది బండారాన్ని బయటపెట్టింది ఇండియా. అసలేం జరిగిందంటే..

ఏ దేశమైనా అభివృద్ధి పథంలో ముందడుగు వేయాలి, ప్రపంచ దేశాలతో పోటీపడాలి, నంబర్ వన్ కంట్రీగా పేరు తెచ్చుకోవాలి అని తహతహలాడతాయి. కానీ పాకిస్థాన్ మాత్రం ఎంతసేపు భారత్ మీద విషం చిమ్ముదామనే ప్రయత్నిస్తూ వస్తోంది. ఏళ్లుగా టెర్రరిజాన్ని పెంచి పోషిస్తూ ఇండియా మీదకు వదులుతోంది. అదే ఉగ్రవాదులు ఇటీవల పహల్గాంలో టూరిస్టులను బలిగొన్నారు. దీంతో సహించలేకపోయిన మోదీ సర్కారు.. ఉగ్రవాదులతో పాటు పాక్‌పై అప్రకటిత యుద్ధం ప్రకటించింది. టెర్రరిస్టులతో పాటు వాళ్లకు అండగా ఉన్న దాయాదిపై ప్రతీకార చర్యలు తీసుకుంటోంది. ఇదే సమయంలో ఆ దేశానికి మరో గట్టి షాక్ కూడా ఇచ్చింది. ప్రపంచ దేశాల ముందు పాక్ పరువు తీసింది భారత్.
అడ్డంగా బుక్కయ్యారు..
ఎన్నో ఏళ్లుగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్న పాకిస్థాన్ తమ దేశంలో టెర్రరిస్టులు లేరని బుకాయిస్తోంది. ఈ నేపథ్యంలో యూకేలోని ఇండియా హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి ప్రపంచ దేశాల ముందు కీలక ఆధారాలు తీసుకొచ్చారు. రీసెంట్‌గా ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్‌లోని టెర్రరిస్టు క్యాంపుల మీద భారత్ జరిపిన దాడుల్లో జైషే ఉగ్రవాది అబ్దుల్ రౌఫ్ అజహర్ చనిపోయాడు. దీంతో అతడితో పాటు ఇతర టెర్రరిస్టుల అంత్యక్రియలకు అక్కడి ఆర్మీ, సర్కారు అధికారులు హాజరై, నివాళులు అర్పిస్తున్న ఫొటోలను యూకే మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ఇందులో టెర్రరిస్టుల శవపేటికపై పాక్ జెండాలు కప్పి ఉన్నాయి. దీని ద్వారా ఉగ్రదాదుల వెనుక ఎవరు ఉన్నారు, వాళ్లకు ఇన్నాళ్లూ అండగా ఉంటోంది ఎవరనేది అందరికీ తెలుస్తోందని విక్రమ్ దొరైస్వామి స్పష్టం చేశారు. టెర్రరిస్టుల వెనుక పాకిస్థాన్ ఉందనే దానికి ఇంతకుమించి మరో ప్రూఫ్ ఉండన్నారు. దీంతో ప్రపంచం ముందు అడ్డంగా బుక్కయింది.. ఇప్పుడు పాక్ మొహం ఎక్కడ పెట్టుకుంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆ దేశానికి సపోర్ట్ చేయడానికి ఎవరూ ముందుకు రారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇవీ చదవండి:
3 రోజుల పాటు ATMలు బంద్.. నిజం ఇదే..
ఆపరేషన్ సిందూర్‌పై బాలీవుడ్‌లో వార్
భారత్, పాక్ యుద్ధం.. కిమ్ సపోర్టు ఎవరికి..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి