Share News

CM Anbnounces Mahila Rojgar Yojana: మహిళా రోజ్‌గార్ యోజనను ప్రకటించిన సీఎం

ABN , Publish Date - Aug 29 , 2025 | 06:04 PM

ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన కింద ఎంపికైన మహిళలకు తమ పని ప్రారంభించేందుకు తొలి ఇన్‌స్టాల్‌మెంట్‌ కింద రూ.10,000 ఆర్థిక సాయం అందజేస్తారు. త్వరలోనే ఆసక్తి గల మహిళల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తారు.

CM Anbnounces Mahila Rojgar Yojana: మహిళా రోజ్‌గార్ యోజనను ప్రకటించిన సీఎం
Nitish Kumar

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్న వేళ బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తూ 'ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన' (Mukhamantri Mahila Rojagar Yojana)ను ప్రకటించారు. ప్రతి ఇంటి నుంచి ఒక మహిళ తనకు నచ్చిన వృత్తి ద్వారా స్వయం ఉపాధి పొందేందుకు అవసరమైన ఆర్థికసాయాన్ని ఈ పథకం ద్వారా అందించనున్నారు. ఈ ప్రతిపాదనకు బిహార్ మంత్రివర్గం శుక్రవారం నాడు ఆమోదం తెలిపింది. మహిళలకు ఉపాధి కల్పించడానికి ఈ పథకాన్ని ఉద్దేశించామని, వారు స్వయం ఉపాధితో జీవనం సాగించేందుకు అవసరమైన ఆర్థికసాయం అందిస్తామని సీఎం తెలిపారు.


సాయం ఇలా అందుతుంది..

ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన కింద ఎంపికైన మహిళలకు తమ పని ప్రారంభించేందుకు తొలి ఇన్‌స్టాల్‌మెంట్‌ కింద రూ.10,000 ఆర్థికసాయం అందజేస్తారు. త్వరలోనే ఆసక్తి గల మహిళల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తారు. గ్రామీణాభివృద్ధి శాఖ ఈ పథకం అమలును సమీక్షిస్తుంది. పట్టణాభివృద్ధి, హౌసింగ్ శాఖ అవసరమైన సాయాన్ని అందిస్తుంది. ఆర్థికసాయం నేరుగా మహిళల బ్యాంకు అకౌంట్‌కు ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి జమ అవుతుంది. మహిళలు చేపట్టనున్న వెంచర్లను అంచనా వేసి దాని ఆధారంగా రూ.2లక్షల వరకూ అదనపు గ్రాంట్ మంజూరు చేసే అవకాశం కూడా ఉంది. అయితే పని ప్రారంభించిన ఆరు నెలల తర్వాత మాత్రమే ఈ సమీక్ష ఉంటుంది. మహిళల ఉత్పత్తులకు స్పెషల్ మార్కెట్‌ ప్లేస్‌లను కూడా డెవలప్ చేస్తారు.


ఈ పథకం కేవలం మహిళలను ఆర్థికంగా పటిష్టం చేయడమే కాకుండా, బిహార్‌లో మెరుగైన ఉపాధి అవకాశాల కల్పనకు దోహదపడుతుందని నితీష్ కుమార్ తెలిపారు. ప్రజలు ఇంకెతమాత్రం ఉపాధి కోసం బయట రాష్ట్రాలకు వెళ్లనవసరం లేదని అన్నారు. తమ ప్రభుత్వం 2005 నుంచి మహిళా సాధికారత కోసం పాటుపడుతోందని, బిహార్ ప్రగతిలో మహిళల పాత్రకు ప్రాధాన్యతనిస్తూ ఎన్నో చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఈ దిశగా ప్రస్తుత పథకం మరో మైలురాయి అని, ఇందువల్ల శాశ్వత ప్రయోజనాలు కలుగుతాయని వివరించారు.


ఇవి కూాడా చదవండి..

మోదీ తల్లిపై వ్యాఖ్యలు.. జెండా కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు

బిహార్‌లో మూడు లక్షల మందికి ఈసీ నోటీసులు..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 29 , 2025 | 06:33 PM