New Vande Bharat Trains: ఎన్నికల వేళ... బిహార్‌కు రెండు వందేభారత్ రైళ్లు
ABN , Publish Date - Aug 29 , 2025 | 04:01 PM
ఇప్పటికే రూట్ ప్లాన్ కూడా రూపొందించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎప్పటి నుంచి ఈ రైళ్లు నడుస్తాయనేది ఇంకా ఖరారు కానప్పటికీ, ఈ ఏడాది చివర నుంచి సేవలు ప్రారంభిస్తాయని తెలుస్తోంది.
న్యూఢిల్లీ: అసెంంబ్లీ ఎన్నికకు సిద్ధమవుతున్న బిహార్ (Bihar)లో రైల్ కనెక్టివిటీకి మరింత ఊతం ఇస్తూ అదనంగా మరో రెండు వందే భారత్ రైళ్లు (Vande Bhrarat Rrains) రానున్నాయి. పాట్నా నుంచి ఈ రెండు రైళ్లు నడుస్తాయని, ఇప్పటికే రూట్ ప్లాన్ కూడా రూపొందించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎప్పటి నుంచి ఈ రైళ్లు నడుస్తాయనేది ఇంకా ఖరారు కానప్పటికీ, ఈ ఏడాది చివర నుంచి సేవలు ప్రారంభిస్తాయని తెలుస్తోంది. బిహార్‌కు మోడ్రన్ వందే భారత్ స్లీపర్‌ను నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకటించవచ్చని అంచనా వేస్తు్న్నారు.
బిహార్‌కు రానున్న రెండు వందేభారత్ రైళ్లలో ఒకటి పాట్నా నుంచి అయోధ్య వరకూ నడుస్తుంది. ముజఫరాపూర్ మీదుగా నార్త్ బిహార్‌లో పలు టౌన్లను కలుపుతూ ఈ రైలు వెళ్తుంది. పాట్నా-అయోధ్య మధ్య 565 కిలోమీటర్ల ప్రయాణానికి 7 గంటల 45 నిమిషాలు పడుతుంది. పాటలీపుత్ర, హజీపూర్, ముజఫర్‌పూర్, బాపుథామ్ మోతిహారి, సుహౌలి, బెట్టాయ్, నార్కటియాగంజ్, బగహ, సీస్వా బజార్, గోరఖ్‌పూర్, బస్తీ, అయోధ్య థామ్‌లలో ఈ రైలు ఆగుతుంది. రాముని జన్మస్థలమైన అయోధ్యకు వెళ్లేందుకు బిహార్ ప్రయాణికులకు ఈ రైలు మరింత సౌకర్యంగా ఉండనుంది.
కాగా, రెండో రైలు పూర్నియా నుంచి ప్రారంభమవుతుంది. మాథేపుర, సహర్సా, ఖగరియా, హసన్‌పూర్ రోడ్, సమస్టిపూర్, ముజఫర్‌పూర్, పాటలీపుత్ర మీదుగా దానాపూర్ చేరుకుంది. రాష్ట్రంలో ఈస్ట్-టు-వెస్ట్ కనెక్టివిటీకి ఈ మార్గం ఎంతో వెసులుబాటుగా ఉండనుంది. రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ ఇటీవల ఢిల్లీలో ఈ రెండు రైళ్లను ప్రకటించారు. ఈ ఏడాది చివరి నాటికి ఈ రెళ్లు పట్టాల మీదకు వస్తాయన్నారు. ప్రయాణికుల డిమాండ్, ట్రావెల్ ఒత్తిళ్లను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
బిహార్‌లో మూడు లక్షల మందికి ఈసీ నోటీసులు..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి