Share News

Mumbai Bus Accident: పాదచారులపైకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు దుర్మరణం

ABN , Publish Date - Dec 30 , 2025 | 09:22 AM

ముంబైలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బస్సు పాదచారులపై దూసుకెళ్లిన ఘటనలో నలుగురు మృతిచెందారు. మరో 9 మంది గాయపడ్డారు.

Mumbai Bus Accident: పాదచారులపైకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు దుర్మరణం
Mumbai Bus Accident

ఇంటర్నెట్ డెస్క్: ముంబై మహానగరంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది(Mumbai Bus Accident). భాండుప్(Bhandup) ఏరియాలో సోమవారం రాత్రి పాదచారులపైకి బెస్ట్ బస్సు(BEST Bus) దూసుకెళ్లడంతో.. నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.


నిత్యం రద్దీగా ఉండే భాండుప్ స్టేషన్ రోడ్ సమీపంలో సోమవారం రాత్రి బస్సు రివర్స్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం, సాంకేతిక లోపం కారణంగానే బస్సు హఠాత్తుగా పాదచారులను బలంగా ఢీకొట్టింది. మృతుల్లో ఓ పురుషుడు, ముగ్గురు మహిళలూ ఉన్నట్టు సమాచారం. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు(Mumbai Police). ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


ఇవీ చదవండి:

పుతిన్‌ నివాసాలపై దాడికి ఉక్రెయున్‌ ప్రయత్నం!

భారతీయుల వర్క్‌ పర్మిట్లన్నీ రద్దు చేయాలి

Updated Date - Dec 30 , 2025 | 11:16 AM