Share News

Bangladesh Group Demands: భారతీయుల వర్క్‌ పర్మిట్లన్నీ రద్దు చేయాలి

ABN , Publish Date - Dec 30 , 2025 | 03:51 AM

బంగ్లాదేశ్‌లో ఇటీవలి తిరుగుబాటుకు నేతృత్వం వహించిన ఇంకిలాబ్‌ మొంచా భారత్‌పై అక్కసు వెళ్లగక్కింది. ఆ దేశంలో భారతీయులందరికీ వర్క్‌ పర్మిట్లు రద్దు చేయాలని బంగ్లాదేశ్‌లోని...

Bangladesh Group Demands: భారతీయుల వర్క్‌ పర్మిట్లన్నీ రద్దు చేయాలి

  • బంగ్లా సర్కారుకు ఇంకిలాబ్‌ మోంచా డిమాండ్‌

ఢాకా, డిసెంబరు 29: బంగ్లాదేశ్‌లో ఇటీవలి తిరుగుబాటుకు నేతృత్వం వహించిన ఇంకిలాబ్‌ మొంచా భారత్‌పై అక్కసు వెళ్లగక్కింది. ఆ దేశంలో భారతీయులందరికీ వర్క్‌ పర్మిట్లు రద్దు చేయాలని బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. తమ నాయకుడు హాదీ హత్యతో సంబంధమున్న వారిని 24 రోజుల్లో పట్టుకుని శిక్షించాలని కోరింది. హాదీ హంతకులు మేఘాలయలోకి వెళ్లారని బంగ్లాదేశ్‌ పోలీసులు ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా, బంగ్లాదేశ్‌లో ఫిబ్రవరి 12న నిర్వహించనున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ(బీఎన్‌పీ) నేత, మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు.. తరీఖ్‌ రెహ్మాన్‌ ఢాకా-17, బొగురా-6 నియోజకవర్గాల్లో నామినేషన్‌ వేశారు. ఇదిలా ఉండగా, బంగ్లాదేశ్‌లో మైనారిటీలు అయిన హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. ఆదివారం అర్ధరాత్రి తర్వాత పిరోజ్‌పూర్‌ జిల్లా దుమ్రిటల గ్రామంలో కొందరు హిందువులకు చెందిన ఇళ్లకు బయటి నుంచి గడియపెట్టి మరీ నిప్పంటించారు.

Updated Date - Dec 30 , 2025 | 03:51 AM