S Jaishankar: భారత్ ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పాక్ ఆర్మీనే కారణం
ABN , Publish Date - Dec 06 , 2025 | 03:40 PM
ఆపరేషన్ సిందూర్‌పై మాట్లాడుతూ, భారత్ నిర్దిష్ట నియమాలు, నిబంధల కింద ఆపరేషన్ చేపట్టిందనని జైశంకర్ అన్నారు. ఎలాంటి చర్య తీసుకున్నా దేశానికి, దేశ ప్రజలకు, మీడియాకు, పౌర సమాజానికి జవాబుదారీగా నిలిచిందని చెప్పారు.
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆర్మీని భారత విదేశాంగ మంత్రి (EAM) ఎస్.జైశంకర్ (S Jaishankar) విమర్శించారు. భారత్ ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పాక్ ఆర్మీనే కారణమని అన్నారు. పాక్ ఆర్మీ భారత్‌పై సైద్ధాంతిక శత్రుత్వానికి పాల్పడుతోందన్నారు.
'ఉగ్రవాదం, ఉగ్రవాద శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేయడం వంటివి చూసినప్పుడు వారు ఇండియాపట్ల శత్రుత్వ విధానాన్ని అనుసరించడం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇదంతా చేస్తున్నదెవరు? ఆర్మీనే' అని జైశంకర్ చెప్పారు. అయితే పాక్ నుంచి ఎలాంటి సవాళ్లు ఎదురైనా దానిని ఎలా ఎదుర్కోవాలనేది న్యూఢిల్లీ చూసుకుంటుందని చెప్పారు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునిర్ గురించి మాట్లాడుతూ, టెర్రరిస్టుల్లో మంచి టెర్రరిస్టులు, చెడు టెర్రరిస్టులు ఉండనట్టే మంచి మిలటరీ నాయకులు, చెడ్డ మిలటరీ నాయకులు అని ఉండరని అన్నారు.
ఆపరేషన్ సిందూర్‌పై మాట్లాడుతూ, భారత్ నిర్దిష్ట నియమాలు, నిబంధల కింద ఆపరేషన్ చేపట్టిందనన్నారు. ఎలాంటి చర్య తీసుకున్నా దేశానికి, దేశ ప్రజలకు, మీడియాకు, సివిల్ సొసైటీకి జవాబుదారీగా నిలిచిందని చెప్పారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌పై విరుచుకుపడింది. పాకిస్థాన్‌లోని తొమ్మిది ప్రాంతాల్లో 24 క్షిపణి దాడులు జరిపింది. 70 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. మరో 60 మంది ఉగ్రవాదులు గాయపడ్డారు. దీంతో పాకిస్థాన్ ఎల్ఓసీ వెంబడి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడింది. మే 10న ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి.
ఇవి కూడా చదవండి..
ప్రపంచ దేశాలతో భారత్ బంధాలను ఎవరూ వీటో చేయలేరు: జైశంకర్
విమాన ఛార్జీల పెంపుపై కేంద్రం ఆగ్రహం..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి