PM Modi Supports Trump: స్నేహితుడు ట్రంప్‌ను అభినందించా: ప్రధాని మోదీ
ABN , Publish Date - Oct 09 , 2025 | 09:45 PM
ఇజ్రాయెల్, ఉగ్రవాద సంస్థ హమాస్ మధ్య యుద్ధానికి ఫుల్ స్టాప్ పడడంలో కీలకంగా వ్యవహరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను అభినందించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. అలాగే సుంకాల కారణంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యంపై సైతం చర్చించినట్లు చెప్పారు.
న్యూఢిల్లీ, అక్టోబర్ 09: ఇజ్రాయెల్, పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ మధ్య రెండేళ్లుగా కొనసాగున్న గాజా యుద్ధాన్ని ముగించి.. సంధి చేసుకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రూపొందించిన రోడ్ మ్యాప్‌పై ఆయనతో మాట్లాడినట్లు భారత ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ చారిత్రాత్మక శాంతి ప్రణాళిక విజయవంతం కావడంపై ట్రంప్‌ను అభినందించినట్లు ఆయన తెలిపారు. ఈ అంశంపై తన స్నేహితుడు ట్రంప్‌తో మాట్లాడినట్లు ప్రధాని మోదీ చెప్పారు. ఇక ప్రతీకార సుంకాల కారణంగా.. ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయన్నారు. అందుకు సంబంధించిన వాణిజ్య చర్యలు న్యూఢిల్లీ, వాషింగ్టన్ సమీక్షిస్తున్నాయని చెప్పారు. అయితే ఈ అంశంపైనా తామిద్దరం సమీక్షించామన్నారు. రానున్న కొన్నిరోజుల్లో ఇవి ఒక కొలిక్కి వస్తాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించారు. తన ఎక్స్ ఖాతాను ట్రంప్ అధికారిక హ్యాండిల్‌కు ప్రధాని ట్యాగ్ చేశారు.
ఇజ్రాయెల్, హమాస్ తన 20 పాయింట్ల గాజా శాంతి ప్రణాళిక మొదటి దశను అంగీకరిస్తున్నట్లు ట్రంప్ ప్రకటన చేశారు. అనంతరం ప్రధాని మోదీ సోషల్ మీడియాలో ఈ పోస్ట్ చేశారు. అయితే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ బలమైన నాయకత్వానికి ప్రతీక అంటూ ప్రధాని మోదీ ఈ సందర్బంగా అభివర్ణించారు.
దీనికి కొన్ని గంటల ముందు.. గాజాలో పోరాటాన్ని నిలిపివేసి బందీలు, ఖైదీలను విడుదల చేయాడానికి అమెరికా మధ్యవర్తిత్వం వహించింది. ఈ శాంతి ప్రణాళిక మొదటి దశకు ఇజ్రాయెల్‌తోపాటు హమాస్ అంగీకరించాయి. దీంతో ఈ యుద్దాన్ని ముగించినట్లు ట్రంప్ గురువారం ప్రకటించారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య శాంతి నెలకొల్పేందుకు ట్రంప్ తీసుకు వచ్చిన 20 పాయింట్లు కోసం.. అమెరికా, ఇజ్రాయెల్, ఈజిప్టు, ఖతార్‌లు ఒక తాటిపైకి వచ్చిన పని చేసిన విషయం విదితమే.
ఈ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
రైతులకు గుడ్ న్యూస్.. నెలకు రూ.5000 పెన్షన్..
భయాందోళనలో ఐపీఎస్ భార్య.. సీఎంకు లేఖ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి