MLA: ఎమ్మెల్యే ఆగ్రహం.. పనులు కావాలంటే డీసీఎంకు జై అనాల్సిందే..
ABN , Publish Date - Jun 26 , 2025 | 01:47 PM
రాష్ట్ర కాంగ్రెస్‌లో సీనియర్ నేతల అసంతృప్తి పెరుగుతోంది. ఐదు గ్యారెంటీలతో గ్రాంట్లు లభించడం లేదని ఆరోపణలు చేస్తున్న ఎమ్మెల్యేలు మరింత ముందుకే వెళ్తున్నారు. ప్రభుత్వంలో పనులు కావాలంటే... డీసీఎం డీకే శివకుమార్‌కు జై అనాల్సిందే అనిపిస్తోందని బెళగావి జిల్లా కాగవాడ ఎమ్మెల్యే రాజుకాగె ఆగ్రహం వ్యక్తం చేశారు.
- ఎమ్మెల్యే రాజు కాగె ఆగ్రహం
బెంగళూరు: రాష్ట్ర కాంగ్రెస్‌లో సీనియర్ నేతల అసంతృప్తి పెరుగుతోంది. ఐదు గ్యారెంటీలతో గ్రాంట్లు లభించడం లేదని ఆరోపణలు చేస్తున్న ఎమ్మెల్యేలు మరింత ముందుకే వెళ్తున్నారు. ప్రభుత్వంలో పనులు కావాలంటే.... డీసీఎం డీకే శివకుమార్(DCM DK Shivakumar)కు జై అనాల్సిందే అనిపిస్తోందని బెళగావి జిల్లా కాగవాడ ఎమ్మెల్యే రాజుకాగె(Kagawada MLA Rajukage) ఆగ్రహం వ్యక్తం చేశారు.
బుధవారం కాగవాడలో ఆయన మీడియాతో మాట్లా డుతూ నేనేమీ తప్పుచేయలేదని, నేను ఎవరికీ జై కొట్టేది లేదన్నారు. అది నా జీవితంలోనే రాలేదన్నారు. పార్టీ అన్ని ప్రక్రియలను సరిచేస్తుందని భావిస్తున్నానన్నారు. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మావైపు తిరిగి కూడా చూడడం లేదని, మేం ఎందుకు పార్టీలో ఉండాలన్నారు.

లెజిస్లేచర్ భేటీ లోనూ సమస్యలు ప్రస్తావించానన్నారు. గతంలో ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించానన్నారు. కొందరు మంత్రుల ప్రవర్తన పట్ల బాధతోనే ఫిర్యాదు చేశానన్నారు. ప్రతిపక్షాలకు అనుకూలమ య్యేలా మాట్లాడేందుకు నాకేమీ వారు బంధువులు కాదన్నారు. వ్యవస్థలోని తప్పిదాలను ఎత్తి చూపానన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
వావ్.. మళ్లీ తగ్గిన తగ్గిన బంగారం, వెండి ధరలు
ఆరోగ్యశ్రీ మాటున మోసం చేస్తే కఠిన చర్యలు
Read Latest Telangana News and National News