Share News

Minister: మంత్రిగారు యమ ధీమాగా ఉన్నారే.. కూటమిని ఓడించడం ఎవరితరం కాదులే..

ABN , Publish Date - Feb 14 , 2025 | 01:07 PM

అన్నాడీఎంకే - బీజేపీ ఏకమై రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా డీఎంకే కూటమిని ఓడించడం సాధ్యం కాదని రాష్ట్రన్యాయశాఖా మంత్రి రఘుపతి(Minister Raghupathi) జోష్యం చెప్పారు.

Minister: మంత్రిగారు యమ ధీమాగా ఉన్నారే.. కూటమిని ఓడించడం ఎవరితరం కాదులే..

- మంత్రి రఘుపతి

చెన్నై: అన్నాడీఎంకే - బీజేపీ ఏకమై రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా డీఎంకే కూటమిని ఓడించడం సాధ్యం కాదని రాష్ట్రన్యాయశాఖా మంత్రి రఘుపతి(Minister Raghupathi) జోష్యం చెప్పారు. రాష్ట్రంలో అధికార డీఎంకే ఓటు బ్యాంకు 5శాతం పెరిగిందన్న ఓ సర్వేపై స్పందించిన మంత్రి రఘుపతి ఈ మేరకు అభిప్రాయాన్ని తెలియజేశారు ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) నేతృత్వంలోని డీఎంకే మోడల్‌ ప్రభుత్వానికి రోజురోజుకు ప్రజాదరణ పెరుగుతోందని మంత్రి అన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Chennai: నన్నే అనుమానిస్తారా.. ఎంజీఆర్‌-జయలలిత హయాంలోనే గుర్తింపు


nani4.2.jpg

2026లో రాష్ట్ర అసెంబ్లీకి జరగబోయే ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ(AIADMK, BJP) పార్టీలు ఏకమై పోటీ చేసినా, విజయం వరించేది మాత్రం డీఎంకే కూటమినేనని నమ్మకం వ్యక్తంచేశారు. అన్నాడీఎంకే సీనియర్‌ నేతలు సెంగోటయ్యన్‌ ఈపీఎస్‌ పట్ల అసంతృప్తితో వున్నారని, ఆయన లాగే మరికొంత మంది సీనియర్లు కూడా వున్నారన్నారు. రాష్ట్రంలో డీఎంకే కూటమి ఓటుబ్యాంకు 50శాతానికి పైగా పెరిగిందని, రాష్ట్రంలో ప్రస్తుతం పార్లమెంట్‌ ఎన్నికలు నిర్వహించినట్లయితే 39స్థానాల్లో ఈ కూటమినే విజయం తప్పక వరిస్తుందని సీఓటర్‌ సర్వేలో వెల్లడైన విషయాన్ని మంత్రి వక్కానించారు. కులాల వారీగా జనగణన నిర్వహించాల్సిందిగా కేంద్రప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తున్నట్లు మంత్రి రఘుపతి తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: ప్రమాణాలు పాటించకుండా ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు ఆహార పదార్థాలు!

ఈవార్తను కూడా చదవండి: సంజయ్‌, కిషన్‌రెడ్డి.. కోతల రాయుళ్లు

ఈవార్తను కూడా చదవండి: ఎస్సీలలోని అన్ని కులాలకు తహసీల్దార్‌ ద్వారానే కుల ధ్రువీకరణ పత్రాలివ్వాలి

ఈవార్తను కూడా చదవండి: Mini Jatara.. మేడారంలో కొనసాగుతున్న మినీజాతర

Read Latest Telangana News and National News

Updated Date - Feb 14 , 2025 | 01:10 PM