Goa Nightclub Fire: కజక్ బెల్లీ డాన్సర్స్‌పై దృష్టి సారించిన దర్యాప్తు సంస్థలు
ABN , Publish Date - Dec 10 , 2025 | 05:31 PM
అగ్నిప్రమాదంలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న క్రిస్టినా బిజినెస్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నట్టు ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయితే వీసా ఇంకా అప్రూవ్ కాలేదని చెప్పారు.
పనజి: గోవా నైట్‌క్లబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 25 మంది మృతి చెందిన ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు జరుగుతోంది. ప్రమాద సమయంలో 'షోలో' చిత్రంలోని 'మెహబూబా మెహబూబా' పాటతో అందరి దృష్టిని ఆకర్షించిన బెల్లీ డాన్సర్ (Belly Dancer) పైనా దర్యాప్తు సంస్థలు తాజాగా దృష్టి సారించారు. 'బిర్చ్ బై రోమియో లేన్' నైట్‌క్లబ్‌లో మంటలు చెలరేగడానికి ముందు బెల్లీ డాన్సర్ క్రిస్టినా అదిరిపోయే స్టెప్పులతో టూరిస్టులు, కస్టమర్లను ఆకట్టుకున్న ఒక వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అగ్నిప్రమాదంలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న క్రిస్టినా బిజినెస్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నట్టు ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO) సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయితే వీసా ఇంకా అప్రూవ్ కాలేదని చెప్పారు. దీంతో చెల్లుబాటయ్యే పర్మిట్ లేకుండా ఆమె ఇండియాలో పనిచేస్తున్నారా అనే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. చెల్లుబాటయ్యే బిజినెస్ వీసా లేకుండా ప్రొఫెషనల్‌గా ఆమె ఇండియాలో పనిచేయరాదని ఎప్ఆర్ఆర్ఓ ఎస్పీ అర్షిల్ అదిల్ తెలిపారు.
కాగా, ప్రమాదం జరిగి కొద్ది గంటలకే నైట్‌క్లబ్ యజమానులైన సౌరబ్ లూథ్రా, గౌరవ్ లూథ్రాలు ఇండిగో విమానంలో థాయ్‌లాండ్‌లోని పుకెట్‌కు పరారయ్యారు. వారి కోసం సీబీఐ విజ్ఞప్తి మేరకు ఇంటర్ పోల్ ఇప్పటికే బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసింది. లూథ్రా సోదరులకు సంబంధించిన నివాసాలు, ఆస్తులపై ఢిల్లీ, గోవా పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
శశిథరూర్‌కు వీరసావర్కర్ అవార్డు... తీసుకోవడం లేదన్న ఎంపీ
జర్మనీ పర్యటనకు రాహుల్.. లీడర్ ఆఫ్ పార్టీయింగ్ అంటూ బీజేపీ విమర్శ, ప్రియాంక కౌంటర్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి