Mamata Banerjee: ఎస్ఐఆర్ పేరుతో నిశ్శబ్ద రిగ్గింగ్.. మమత నిరసన ర్యాలీ
ABN , Publish Date - Nov 04 , 2025 | 07:07 PM
పశ్చిమబెంగాల్ ఎన్నికల జాబితా నుంచి అర్హులైన ఒక్క ఓటరును తొలగించినా బీజేపీ ప్రభుత్వ పతనాన్ని తమ పార్టీ చూస్తుందని మమత హెచ్చరించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల కమిషన్‌తో కేంద్రం కుమ్మక్కై ఎస్ఐఆర్ ప్రక్రియను ఒక ఉపకరణంగా వాడుకుంటోందని విమర్శించారు.
కోల్‌కతా: బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) మంగళవారంనాడు విరుచుకుపడ్డారు. ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) బెంగాలీ మాట్లాడే పౌరులను లక్ష్యంగా చేసుకుని చేపట్టిన 'నిశ్శబ్ద రిగ్గింగ్' అని ఆరోపించారు. ఎస్ఐఆర్‌కు వ్యతిరేకంగా మంగళవారనాడు కోల్‌కతా వీధుల్లో భారీ ర్యాలీని మమత ముందుండి నడిపించారు. ఆమె మేనల్లుడు, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటు సభ్యుడు అభిషేక్ బెనర్జీ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
ఇంత హడావిడిగా ఎందుకు?
ఎలక్షన్ కమిషన్ టైమ్‌లైన్ పెట్టుకుని మరీ ఇంత హడావిడిగా ఎస్ఐఆర్ నిర్వహించడాన్ని మమతా బెనర్జీ తప్పుపట్టారు. బెంగాల్‌లో 2022లో ఓటర్ రివిజన్ జరిగిందని, అందుకు రెండేళ్లు పట్టిందని అన్నారు. ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ నెలరోజుల్లోనే పూర్తిచేయాలనుకుంటున్నారని అన్నారు. ఈసీ పారదర్శకత్వను ప్రశ్నిస్తూ... బిహార్ ఎస్ఐఆర్‌లో ఎంతమంది రోహింగ్యాలు, బంగ్లాదేశీయులను గుర్తించారో చెప్పాలన్నారు.
ఓటర్లను తొలిగించారో...
పశ్చిమబెంగాల్ ఎన్నికల జాబితా నుంచి అర్హులైన ఒక్క ఓటరును తొలగించినా బీజేపీ ప్రభుత్వ పతనాన్ని తమ పార్టీ చూస్తుందని మమత హెచ్చరించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల కమిషన్‌తో కేంద్రం కుమ్మక్కై ఎస్ఐఆర్ ప్రక్రియను ఒక ఉపకరణంగా వాడుకుంటోందని విమర్శించారు. హిందీ, పంజాబీ మాట్లాడే వాళ్లు ఎలా పాకిస్థానీయులు కాదో బంగ్లా మాట్లాడే వాళ్లు బంగ్లాదేశీయులు కాదని మమత అన్నారు.
భయంతో ఏడుగురు మృతి
ఎస్ఐఆర్ పేరుతో ఓటర్లను బీజేపీ భయపెట్టే ప్రయత్నం చేస్తోందని, ఈ భయాలతోనే ఇప్పటికే ఏడుగురు ప్రాణాలు తీసుకున్నారని టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ అన్నారు. లీగల్ ఓటర్లను ఎన్నికల జాబితా నుంచి తొలగిస్తే ఢిల్లీలో మెగా నిరసనకు మద్దతుదారులంతా సిద్ధంతా ఉండాలని కోరారు. కాగా, టీఎంసీ నిరసనలపై బీజేపీ మండిపడింది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేపట్టిన ర్యాలీ ఇదని ఆక్షేపణ తెలిపింది. అక్రమ వలసదారులను తమ ఓటు బ్యాంకుగా చేసుకున్న మమతా బెనర్జీ ఇప్పుడు వారికి రక్షణ కల్పిస్తున్నారని బీజేపీ ప్రతినిధి అమిత్ మాలవీయ ఆరోపించారు.
ఇవి కూడా చదవండి..
కోడ్ ఉల్లంఘన.. కేంద్ర మంత్రిపై కేసు
హిందుజా గ్రూప్ చైర్మన్ కన్నుమూత
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి