Share News

Mamata Banerjee: కోల్‌కతా మెట్రో ప్రాజెక్టు క్రెడిట్ నాదే.. మోదీ కార్యక్రమానికి మమత దూరం

ABN , Publish Date - Aug 22 , 2025 | 06:22 PM

మమతా బెనర్జీ కేంద్ర రైల్వే మంత్రిగా రెండు సార్లు పనిచేశారు. మొదటిసారి అటల్ బిహారీ వాజ్‌పేయి సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వంలో 1999 నుంచి 2001 వరకూ పనిచేశారు. రెండోసారి కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ-2 ప్రభుత్వంలో 2009 నుంచి 2011 వరకూ పనిచేశారు.

Mamata Banerjee: కోల్‌కతా మెట్రో ప్రాజెక్టు క్రెడిట్ నాదే.. మోదీ కార్యక్రమానికి మమత దూరం
Mamata Banerjee

కోల్‌కతా: సిటీలోని మూడు మెట్రో మార్గాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం సాయంత్రం ప్రారంభించే కార్యక్రమానికి దూరంగా ఉండాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) నిర్ణయం తీసుకున్నారు. రైల్వే మంత్రిగా తాను ఉన్నప్పుడే ఈ మెట్రో రైల్ ప్రాజెక్టులను ప్లాన్ చేసి, మంజూరు చేసినట్టు శుక్రవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ మమతా బెనర్జీ చెప్పారు. రూ.5,200 కోట్ల విలువైన మూడు కీలక మెట్రో మార్గాలతో సహా మౌలిక వసతుల ప్రాజెక్టులను ప్రధాని కోల్‌కతా పర్యటనలో ప్రారంభిస్తున్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో వలస వచ్చిన బిహారీలను వేధిస్తున్నారని మమత ఆరోపిస్తూ ఈ కార్యక్రమానికి హాజరుకారాదని నిర్ణయం తీసుకున్నారు.


మమతా బెనర్జీ కేంద్ర రైల్వే మంత్రిగా రెండు సార్లు పనిచేశారు. మొదటిసారి అటల్ బిహారీ వాజ్‌పేయి సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వంలో 1999 నుంచి 2001 వరకూ పనిచేశారు. రెండోసారి కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ-2 ప్రభుత్వంలో 2009 నుంచి 2011 వరకూ పనిచేశారు. రెండోసారి తాను రైల్వే మంత్రిగా ఉన్నప్పుడే కోల్‌కతాలోని మెట్రో విస్తరణ ప్రాజెక్టుల సిరీస్‌ను తాను మంజూరు చేశానని మమతా బెనర్జీ తెలిపారు.


'ఆనాటి విషయాలను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. రైల్వే మంత్రిగా నేను ఉన్నప్పుడు మెట్రోపాలిటన్ కోల్‌కతాలో పలు మెట్రో రైల్వే కారిడార్లకు ప్లాన్ చేసి, మంజూరు చేశాను. బ్లూప్లింట్ల తయారీ, నిధులు సమకూర్చడంతో పనులను ప్రారంభించాం. సిటీలోని వివిధ ప్రాంతాల్లో పనులు చేపట్టి, ఇంట్రా సిటీ మెట్రోగ్రిడ్‌కు అనుసంధానించాం. ఆ తర్వాత పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా ఈ ప్రాజెక్టుల అమలులో పాలుపంచుకున్నాను' అని మమతా బెనర్జీ తెలిపారు.


రాష్ట్రం నుంచి ఉచితంగా భూములు కేటాయించామని, రోడ్లు వేశామని, నిర్వాసితులకు పునరావాసం కల్పించామని, అన్ని అవరోధాలను తొలగించామని, ప్రాజెక్టుల అమలుకు అన్నిరకాలుగా సహకరించామని సీఎం చెప్పారు. ఎగ్జిక్యూషన్ ఏజెన్సీలతో సమన్వయం సమావేశాలను చీఫ్ సెక్రటరీలు విజయవంతంగా నిర్వహించారని చెప్పారు. మెట్రో మౌలిక వసతుల విస్తరణలో రైల్వే మంత్రిగా, సీఎంగా సుదీర్ఘ ప్రయాణం సాగించినట్టు వివరించారు.


ఇవి కూడా చదవండి..

వెబ్ సిరిస్‌లో మోదీ మాజీ బాడీగార్డ్

పార్లమెంట్‌లోకి ఆగంతకుడు.. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది

For More National News And Telugu News

Updated Date - Aug 22 , 2025 | 06:28 PM