Share News

Road Accident: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి

ABN , Publish Date - Oct 18 , 2025 | 07:05 PM

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో తీసుకెళ్తున్న వాహనం అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఎనిమంది దుర్మరణం చెందారు. తొలుత ఆరుగురు చనిపోగా..ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు చనిపోయారు. ఈ ప్రమాదంలో 28 మంది గాయపడ్డారు.

 Road Accident: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి
Road Accident

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం(Maharashtra road accident)చోటుచేసుకుంది. ప్రయాణికులతో తీసుకెళ్తున్న వాహనం అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఎనిమంది దుర్మరణం చెందారు. తొలుత ఆరుగురు చనిపోగా..ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు చనిపోయారు. ఈ ప్రమాదంలో 28 మంది గాయపడ్డారు. వీరి కూడా 15 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మహారాష్ట్రలోని నందూర్భార్ జిల్లాలోని చాంద్సైలి ప్రాంతం(Chandsaili Ghat Accident) సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. శనివారం ప్రయాణికులను తీసుకువెళ్తున్న వాహనం చాంద్సైలి ఘాట్ లో ప్రాంతంలో అదుపుతప్పి లోయలో పడింది. మూలమలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.


బాధితులంతా స్థానికంగా ఉండే ఓ పుణ్యక్షేత్రానికి వెళ్లి తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలోనే మరికాసేపట్లో ఇళ్లకు చేరుకుంటాము అనుకునే సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్ అక్కడి చేరుకున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై( Road Accident) కేసు నమోదు చేసిన పోలీసులు(Police Case) దర్యాప్తు చేస్తున్నారు. ఒకే ప్రాంతానికి చెందిన 8 మంది మృతి చెందడటంతో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇలా నిత్యం కొందరు డ్రైవర్ల నిర్లక్ష్యానికి, ఇతర కారణాలతో ఎంతో మంది అమాయకులు బలవుతున్నారు. వాహనాలు, వాటిని నడిపే డ్రైవర్ల విషయంలో ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు భావిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

పోక్సో కేసుల పరంపర.. తల్లిదండ్రుల ఆందోళన

పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్యకు కేటీఆర్ అండ

Komaram Bheem: దారుణం.. కొడుకు చేసిన పనికి కోడలిని చంపిన మామ

Updated Date - Oct 18 , 2025 | 07:05 PM