shocking video: యమధర్మరాజు లీవ్‌లో ఉన్నాడేమో.. ఒక బైక్ మీద ఎలా వెళ్తున్నారో చూడండి..
ABN , Publish Date - Oct 18 , 2025 | 06:34 PM
కొందరు ట్రాఫిక్ రూల్స్‌ను పాటించకుండా రోడ్డు ప్రయాణాలు చేస్తుంటారు. అత్యంత ప్రమాదకరంగా బైక్ రైడింగ్ చేస్తుంటారు. ముఖ్యంగా యువకులు ఈ తరహా బైక్ స్టంట్‌లు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. అయితే ఏమాత్రం తేడా వచ్చినా ఎంత పెద్ద ప్రమాదానికి గురి కావాల్సి వస్తుందో ఊహించడం కూడా కష్టమే
కొందరు ట్రాఫిక్ రూల్స్‌ను పాటించకుండా రోడ్డు ప్రయాణాలు చేస్తుంటారు. అత్యంత ప్రమాదకరంగా బైక్ రైడింగ్ చేస్తుంటారు. ముఖ్యంగా యువకులు ఈ తరహా బైక్ స్టంట్‌లు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. అయితే ఏమాత్రం తేడా వచ్చినా ఎంత పెద్ద ప్రమాదానికి గురి కావాల్సి వస్తుందో ఊహించడం కూడా కష్టమే. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Shocking Bike Stunt).
@abhinav3096 అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. బిజీగా ఉన్న రోడ్డు మీద కొందరు కుర్రాళ్లు బైక్ జర్నీ చేస్తున్నారు. ఆ బైక్ మీద దాదాపు ఎనిమిది మంది కూర్చుని ప్రయాణం చేస్తున్నారు. బైక్ హ్యాండిల్ మీద కూడా ఒకరు కూర్చుని ఉండడం ఆ వీడియోలో కనిపిస్తోంది. అదే రోడ్డు మీద ప్రయాణం చేస్తున్న ఓ వ్యక్తి వారిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఏ మాత్రం తేడా జరిగినా వారందరూ ఎంత పెద్ద ప్రమాదానికి గురవుతారో ఊహించడం కూడా కష్టం (unbelievable video).
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Indian viral video). 18 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. కారులో కూడా అంత మంది కూర్చోవడం కష్టమేనని ఒకరు కామెంట్ చేశారు. యమధర్మ రాజు లీవ్‌లో ఉన్నాడేమోనని మరొకరు పేర్కొన్నారు. వారందరూ కోరి మరణాన్ని ఆహ్వానిస్తున్నారని మరొకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
వామ్మో.. ఈమెకేమైంది.. వేగంగా వెళ్తున్న రైలు డోర్ దగ్గర నిల్చుని ఏం చేసిందంటే..
చెట్టు మీద పిల్లి.. 7 సెకెన్లలో కనిపెడితే మీ కళ్లు సూపర్ పవర్‌ఫుల్..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..