Woman throws stone: వామ్మో.. ఈమెకేమైంది.. వేగంగా వెళ్తున్న రైలు డోర్ దగ్గర నిల్చుని ఏం చేసిందంటే..
ABN , Publish Date - Oct 18 , 2025 | 04:47 PM
కొందరు వ్యక్తులు బహిరంగంగా విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఎదుటివారికి ఇబ్బందులు కలిగిస్తుంటారు. మానసిక స్థితి సరిగ్గా లేని వ్యక్తులు ఎప్పుడు, ఎలా ప్రవర్తిస్తుంటారో అంచనా వేయడం కష్టం. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే షాకవక తప్పదు.
కొందరు వ్యక్తులు విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఎదుటివారికి ఇబ్బందులు కలిగిస్తుంటారు. మానసిక స్థితి సరిగ్గా లేని వ్యక్తులు ఎప్పుడు, ఎలా ప్రవర్తిస్తుంటారో అంచనా వేయడం కష్టం. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే షాకవక తప్పదు. ఆ వీడియోలోని మహిళ కదులుతున్న రైలు తలుపు వద్ద నిలబడి అందరినీ భయాందోళనలకు గురి చేసింది. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది (shocking train video).
@gharkekalesh అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక మహిళ కదులుతున్న రైలు తలుపు వద్ద నిలబడి ఉంది. పక్క ట్రాక్ మీద ఎదురుగా వేరే హై-స్పీడ్ రైలు వస్తోంది. రైలు దగ్గరగా రాగానే, ఆమె ఆ రైలు ఇంజిన్ అద్దం పైకి రాయి విసిరింది. భారతీయ రైల్వే నియమాల ప్రకారం ఇలా ప్రవర్తించడం చట్టరీత్యా నేరం. ఈ ప్రమాదకరమైన చర్యను ఒకరు రికార్డ్ చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (bizarre train incident).
ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 53 లక్షల మంది వీక్షించారు (bizarre train incident). 9 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ఆమె మతిస్థిమితం కోల్పోయిన మహిళలా కనిపిస్తోందని ఒకరు కామెంట్ చేశారు. 'వామ్మో.. ఆమె ఎందుకలా ప్రవర్తించింది' అని ఒకరు ప్రశ్నించారు. అది అత్యంత ప్రమాదకర చర్య అని మరొకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
వామ్మో.. మాజీ ప్రియుడిపై ఇలా కూడా పగ తీర్చుకుంటారా? ఏం జరిగిందంటే..
మీ తెలివికి పరీక్ష.. ఈ ఫొటోలో ఏనుగు ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..