Share News

Madhya Pradesh: మతమార్పిడికి నిరాకరించిందని.. గొంతుకోసి చంపిన ప్రియుడు..

ABN , Publish Date - Aug 04 , 2025 | 02:51 PM

మధ్యప్రదేశ్‌లో యువతిని దారుణంగా హత్య చేశాడు ఓ మతోన్మాది. మాటల సందర్భంగా పెళ్లికి ముందు మతం మార్చుకోవాలని ప్రియురాలిని ఒత్తిడి చేశాడు ఓ యువకుడు. అందుకు ఆమె ససేమిరా అనడంతో గొంతు కోసి..

Madhya Pradesh: మతమార్పిడికి నిరాకరించిందని.. గొంతుకోసి చంపిన ప్రియుడు..
Man Slits Woman Throat in Madhya Pradesh

మధ్యప్రదేశ్: మతమార్పిడికి నిరాకరించిందనే కోపంతో ఓ యువకుడు ప్రియురాలిని హత్య చేసిన ఉదంతం సంచలనం రేపుతోంది. పెళ్లి విషయం గురించి ప్రియురాలితో మాట్లాడుతూనే హఠాత్తుగా కత్తి తీసి ఆమె గొంతు కోశాడు. అనంతరం చనిపోయేవరకూ పలుమార్లు పొడిచి చంపాడు. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ లో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. నేపానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవారాలో జరిగిన ఈ దుర్ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


మధ్యప్రదేశ్ అంతటా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ హత్యోదంతం నేపానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవారా గ్రామంలో చోటుచేసుకుంది. భాగ్య శ్రీ నామ్‌దేవ్ ధనుక్‌(35) అనే మహిళను ఇస్లాం మతంలోకి మారమని ఆమె ప్రియుడు షేక్ రయూస్ (42) ఒత్తిడి చేశాడు. బాధితురాలి ఇంట్లోనే ఈ విషయమై ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి. రయీస్ ఎంత ప్రయత్నించినప్పటికీ భాగ్య శ్రీ ఒప్పుకోలేదు. దీంతో రెచ్చిపోయిన రయీస్ కత్తితో ఆమె గొంతు కోసి చంపాడు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కొన్ని గంటల్లోనే పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.


బాధితురాలి సోదరి సుభద్ర బాయి చెప్పిన వివరాల ప్రకారం, 'రయీస్ చాలా కాలంగా వివాహం, మత మార్పిడి కోసం నా చెల్లెలిపై ఒత్తిడి తెస్తున్నాడు. చాలా సార్లు ఆమె జుట్టు పట్టుకుని కొట్టేవాడు. శారీరకంగా హింసించేవాడు. ఎంత బలవంతం చేసినప్పటికీ నా సోదరి మతమార్పిడికి నిరాకరించింది. దీంతో రాత్రి 11 గంటల సమయంలో ఇంట్లోకి వచ్చినపుడు ఆమె గొంతు కోసి చంపేశాడు'.

హత్య గురించి సమాచారం అందిన వెంటనే బుర్హాన్‌పూర్ ఎస్పీ దేవేంద్ర కుమార్ పాటిదార్, ఏఎస్పీ ఏఎస్ కనేష్ నేపానగర్‌కు చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం నిందితుడిపై హత్య, దారుణం సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కస్టడీ విధించారు.


ఇవి కూడా చదవండి

రన్ వేపై ఆగిపోయిన ఎయిర్ ఇండియా విమానం.. 3 గంటలు అవుతున్నా..

గల్వాన్ వ్యాలీ వివాదంలో రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు వార్నింగ్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 04 , 2025 | 03:33 PM