Arvind Kejriwal:స్నేహం చేస్తారా? కటీఫ్ చెబుతారా?.. కేజ్రీ ప్లాన్ అదేనా?
ABN , Publish Date - Feb 09 , 2025 | 08:34 PM
Arvind Kejriwal: ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం కోల్పోవడమే కాదు.. ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఎమ్మెల్యేగా సైతం ఓటమి పాలయ్యారు. మరి అలాంటి వేళ.. భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా హస్తం పార్టీకి ఆయన స్నేహ హస్తం అందిస్తారా? లేక కటీఫ్ చెబుతారా? అనే ఓ మీమాంస సామాన్యుడిలో కొనసాగుతోంది.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటరు పట్టం కట్టాడు. దీంతో వరుసగా మూడోసారి అధికారాన్ని చేపట్టి హ్యాట్రిక్ కొడదామనుకొన్న ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ఆశలు కాస్తా అడియాసలయ్యాయి. ఈ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలువ లేకపోయారు. ఈ ఎన్నికల్లో ఆప్‌కి కేవలం 22 స్థానాలే దక్కాయి. ఇక ఇండియాలో మరో భాగస్వామ్య పక్షమైన కాంగ్రెస్ పార్టీ వరుసగా మూడోసారి సైతం ఖాతా తెరవలేని పరిస్థితి ఏర్పడింది.
ఇక దేశంలో అతి తక్కువ రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందన్న సంగతి అందరికి తెలిసిందే. మరి అలాంటి వేళ ఇండియా కూటమిలో భాగసామ్య పక్షమైన కాంగ్రెస్ పార్టీతో కలిసి భవిష్యత్తులో అరవింద్ కేజ్రీవాల్ అడుగులు వేస్తారా? లేక.. తన దారి తాను చూసుకుంటారా? అనే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ పరిస్థితి... గతానికి ప్రస్తుతానికి చాలా తేడా ఉంది.
అవినీతి మకిలి
గతంలో ఆయన ఎలా ఉన్నా.. ప్రస్తుతం మాత్రం ఆయన్ని అవినీతి మకిలి అంటిది. ఇంకా చెప్పాలంటే ఢిల్లీ మద్యం కుంభకోణం మనీ లాండరింగ్ వ్యవహారంలో ఆయనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. దీంతో ఆయన కొన్ని నెలల పాటు తీహాడ్ జైల్లో ఉన్నారు.
Also Read: బీజేపీ సీఎం రాజీనామా
ప్రకటన చేసినా.. బీజేపీకి పట్టం..
అనంతరం కండిషన్లతో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది. దీంతో జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన.. తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా తీర్పును అనుసరించి.. మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపడతానంటూ అదే సమయంలో ప్రకటన చేశారు. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం ఓటర్లు బీజేపీకి పట్టం కట్టారు.
Also Read: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో త్వరలో బీసీ సభ
ఒంటరిగా వెళ్లితే.. ఇబ్బందేనా..?
మరి కేజ్రీవాల్ హస్తం పార్టీతో కలిసి నడుస్తారా? అంటే కలిసి నడిచే అవకాశముంది. కేంద్రంతోపాటు ఢిల్లీలో సైతం బీజేపీ అధికారంలో ఉంది. దీంతో అరవింద్ కేజ్రీవాల్ ఒంటరిగా వెళ్లితే ఆయనకు రాజకీయ భవిష్యత్తు ఒకింత ఇబ్బందిగా మారే అవకాశం లేక పోలేదని స్పష్టమవుతోంది. అది కూడా ఎలాగంటే.. మద్యం కేసులో భవిష్యత్తులో మళ్లీ ఆయన ఏదో ఒక సమయంలో అరెస్టయ్యే అవకాశముంది. దీంతో ఆయన జైలుకు కానీ వెళ్లితే.. ఆ సమయంలో ఆ పార్టీని బతికించాల్సి ఉంటుంది. మరి ఆ వేళ అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ కానీ.. ఆ పార్టీ ఎమ్మెల్యే, మాజీ సీఎం అతిషి వల్ల పార్టీ బతుకుతుందా? అంటే అది సాధ్యమయ్యే పని కాదు.
Also Read: గురుమూర్తి రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు.. అందుకే చంపేశాడు
బలం.. బలగం
కేజీవాల్‌తోపాటు ఆ పార్టీకి బలం, బలగం ఉండాలి. ఆ క్రమంలో ఇండియా కూటమిలోని మిగిలి భాగస్వామ్య పక్షాలైన సమాజవాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, జార్ఖండ్ ముక్తి మోర్చ, రాష్ట్రీయ జనతా దళ్ తదితర పార్టీల మద్దతు కేజ్రీవాల్‌కు ఇప్పటికే ఉన్నాయి. వీటితోపాటు కాంగ్రెస్ పార్టీ అండ దండ సైతం కేజ్రీవాల్‌కి ఉండాల్సి ఉంటుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ లోక్ సభలో ప్రతిపక్ష హోదా సాధించింది. దీంతో కేజ్రీవాల్ అరెస్టయినా... ఆయనకు మద్దతుగా మిగిలిన భాగస్వామ్య పక్షాలతో కలిసి పార్లమెంట్ వేదికగా పోరాటానికి దిగుతుందన్నది సుస్పష్టం.
Also Read: ప్రైవేట్ ఆసుపత్రులకు హెల్త్ మినిస్టర్ కీలక సూచన
నీకు నీవే.. మాకు మేమే..
అలా కానీ పక్షంలో హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ.. కాంగ్రెస్, ఆప్ నీకు నీవే.. మాకు మేమే అన్నట్లు వ్యవహరించడంతో.. ఆ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు ఘోర పరాజయం మూట కట్టుకొన్నాయి. తాజాగా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే తీరుగా వ్యవహరించి.. ఆప్ కేవలం 22 స్థానాలకు పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తీసుకట్టుగా మారింది. దీంతో ఆ పార్టీ ఒక్క ఎమ్మెల్యే సీటును సైతం దక్కించుకోలేక పోయింది.
Also Read: ఢిల్లీ సీఎం అభ్యర్థి ఫిక్స్.. అధిష్టానం చూపు అతడి వైపే
భవిష్యత్తు ఆలోచన..
ఇటువంటి పరిస్థితుల్లో.. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని.. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. ఇండియా కూటమిలోని మిగిలిన భాగస్వామ్య పక్షాలతోనే ప్రధాన భాగస్వామ్య పక్షమైన కాంగ్రెస్ పార్టీతో కలిసి మళ్లీ అడుగులో అడుగు వేసి నడిస్తే మాత్రం.. భవిష్యత్తు రాజకీయాల్లో ఈ రెండు పార్టీలు రికార్డు సృష్టించే అవకాశం లేకపోలేదన్నది సుస్పష్టం.
Also Read: దండకారణ్యంలో ఎన్‌కౌంటర్.. మావోయిస్టులకు భారీ దెబ్బ
సామాన్యుడి పార్టీ సైతం
ఓ వేళ కాంగ్రెస్ పార్టీతో వెళ్లేకంటే.. ఒంటరిగానే వెళ్లడం నయమని కేజ్రీవాల్ భావిస్తారా?. ఓ వేళ ఆయన ఒంటరిగా వెళ్లాలని ఆయన భావిస్తే మాత్రం.. ఆమ్ ఆద్మీ పార్టీ అంటే సామాన్యుడి పార్టీ ఏమిటనేది సామాన్యుడు సైతం ఆలోచించాల్సి ఉంటుందన్నది సుస్పష్టం.
For National News And Telugu News