Share News

Minister Satya Kumar: ప్రైవేట్ ఆసుపత్రులకు హెల్త్ మినిస్టర్ కీలక సూచన

ABN , Publish Date - Feb 09 , 2025 | 04:32 PM

Minister Satya Kumar: క్యాన్సర్‌ను 63 శాతం నివారించవచ్చని ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ తెలిపారు. గుండె జబ్లుకు రూ. 45 వేల విలువైన ఇంజెక్షన్‌ను రాష్ట్రంలోని అన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ప్రభుత్వం ఉచితంగా అందించే ఏర్పాటు చేస్తుందన్నారు.

Minister Satya Kumar: ప్రైవేట్ ఆసుపత్రులకు హెల్త్ మినిస్టర్ కీలక సూచన

విజయవాడ, ఫిబ్రవరి 09: ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ముందుకు రావాలని ప్రైవేట్ ఆసుపత్రులకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదలకు రూ. 25 లక్షల మేర వైద్య సహాయాన్ని ఏర్పాటు చేశారని వివరించారు. వైద్యానికి 6.5 శాతం బడ్జెట్‌లో నిధుల పెంచి రూ.18,500 కోట్లు కేటాయించారన్నారు.

Also Read: ఢిల్లీ సీఎం అభ్యర్థి ఫిక్స్.. అధిష్టానం చూపు అతడి వైపే

అలాగే వైద్యానికి 12 శాతం నిధులను బడ్జెట్‌లో కేంద్రం పెంచిందని వివరించారు. ఆదివారం విజయవాడలో మంత్రి సత్యకుమార్ మాట్లడుతూ.. క్యాన్సర్ నివారణకు 4 కోట్ల మంది ప్రజలకు ఉచిత వైద్య సేవలు.. ప్రభుత్వాసుపత్రులలో అందుతున్నాయన్నారు. క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తించాలన్నారు. క్యాన్సర్ పరీక్షలు.. తొలి దశలోనే చేసుకోవాలని మహిళలకు ఈ సందర్భంగా ఆయన సూచించారు. క్యాన్సర్‌ను 63 శాతం నివారణ చేయవచ్చని చెప్పారు.

Also Read: దండకారణ్యంలో ఎన్‌కౌంటర్.. మావోయిస్టులకు భారీ దెబ్బ

గుండె జబ్బులకు రూ. 45 వేల విలువైన ఇంజక్షన్‌ను రాష్ట్రంలోని అన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ప్రభుత్వం ఉచితంగా అందించే ఏర్పాటు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇక కంటి జబ్బులున్న విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు ప్రభుత్వ వైద్యులు నిర్వహిస్తున్నారన్నారు.

For National News And Telugu News

Updated Date - Feb 09 , 2025 | 04:32 PM