Karnataka NEWS: దారుణం.. భార్య వివాహేతర సంబంధం.. భర్త ఏం చేశాడంటే..
ABN , Publish Date - May 03 , 2025 | 02:06 PM
Karnataka NEWS: కర్ణాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధంతో భార్యను, ఆమె ప్రియుడును భర్త చంపేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
కర్ణాటక: ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలతో ప్రాణాలు తీస్తున్న సంఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తమ భాగస్వామి ఇతరులతో సంబంధం పెట్టుకున్నారనే కోపం పట్టలేక హత్యల వరకూ వెళ్తున్నారు భార్యభర్తలు. భారత సమాజంలో వైవాహిక బంధాలు విశ్వాసం, నమ్మకంపై ఆధారపడి ఉంటాయి. కానీ ఈ నమ్మకాన్ని పలువురు దుర్వినియోగం చేస్తున్నారు. జీవిత భాగస్వామిని మోసం చేస్తూ అక్రమ సంబంధాలను కొనసాగిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఇద్దరూ తమ విలువైన జీవితాలను కోల్పోతున్నారు. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రంలోని కలబుర్గి జిల్లా ఆళంద తాలుకాలోని మాదన హిప్పర గ్రామంలో శ్రీమంత, సృష్టి అనే భార్యభర్తలు అన్యోన్యంగా జీవించేవారు. శ్రీమంత వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శ్రీమంత, సృష్టి పెళ్లి అయిన దగ్గరి నుంచి ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే సృష్టికి ఇటీవల ఖాజప్ప అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా అక్రమ సంబంధానికి దారి తీసింది. దీంతో శ్రీమంత వ్యయసాయ పనులకు వెళ్లినప్పుడల్లా వారిద్దరూ కలుసుకునేవారు.
ఇదే క్రమంలో గురువారం(మే1) దగ్గరలోని పట్టణానికి వెళ్లాడు శ్రీమంత. ఈ సమయంలో సృష్టిని కలవడానికి ఖాజప్ప వచ్చాడు. అయితే బయటకు వెళ్లిన శ్రీమంత తిరిగి ఇంటికి వచ్చాడు. ఈ సమయంలో ఖాజప్ప తన భార్య సృష్టితో కలిసి ఉండటాన్ని చూసి తీవ్ర ఆగ్రహనికి గురయ్యాడు. కోపంతో రగిలిపోయిన అతను సృష్టి, ఆమె ప్రియుడు ఖాజప్పను కొడవలితో నరికేశాడు. తీవ్రగాయాలైన వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఆ తర్వాత నేరుగా వెళ్లి హిప్పరగి పోలీస్ స్టేషన్‍లో శ్రీమంత లొంగిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి
Gold Rates Today: రెండో రోజు తగ్గిన బంగారం, వెండి ధరలు..ఇంకా తగ్గుతాయా..
Lift Irrigation: మళ్లీ సీడబ్ల్యూసీకి ‘పాలమూరు’ డీపీఆర్
Kishan Reddy: ఓల్డ్ సిటీకీ నిధులు కేటాయించాలి
పెద్దపల్లి ఎయిర్‌పోర్టు.. బసంత్‌నగర్‌లో కాదు.. అంతర్గాంలో!
Read Latest Telangana News and Telugu News