Bihar Assembly Elections: ఒకే విడతలో అభ్యర్థులను ప్రకటించిన హెచ్ఏఎం
ABN , Publish Date - Oct 14 , 2025 | 07:53 PM
హెచ్ఏఎం అభ్యర్థుల్లో దీపా కుమారి (ఇమామ్ గంజ్), అనిల్ కుమార్ (తెకరి), జ్యోతి దేవి(బరచాటి), రోమిత్ కుమార్ (అత్రి), ప్రఫుల్ కుమార్ సింగ్ (సికింద్రా), లలన్ రామ్ (కుటుంబ) ఉన్నారు.
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Assembly Elections) హిందుస్థాన్ అవామ్ మోర్చా (HAM) తరఫున పోటీ చేసే ఆరుగురు అభ్యర్థులను ఆ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ (Jitan Ram Manjhi) మంగళవారంనాడు ప్రకటించారు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న హెచ్ఏఎంకు 6 సీట్లు కేటాయించారు. దీంతో మొత్తం ఆరు సీట్లలో పోటీ చేసే అభ్యర్థులను ఆ పార్టీ ఇప్పుడు ఖరారు చేసింది.
హెచ్ఏఎం అభ్యర్థుల్లో దీపా కుమారి (ఇమామ్ గంజ్), అనిల్ కుమార్ (తెకరి), జ్యోతి దేవి(బరచాటి), రోమిత్ కుమార్ (అత్రి), ప్రఫుల్ కుమార్ సింగ్ (సికింద్రా), లలన్ రామ్ (కుటుంబ) ఉన్నారు.
బీజేపీ సైతం..
బీజేపీ సైతం బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 71 మంది అభ్యర్థుల జాబితాను మంగళవారం విడుదల చేసింది. సీట్ల పంపకాల్లో భాగంగా 101 సీట్లలో బీజేపీ పోటీ చేస్తోంది. తాజా జాజితాలో ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా, మాజీ ఉప ముఖ్యమంత్రి రేణు దేవి తదితర ప్రముఖులు ఉన్నారు. 8 మంది మహిళా అభ్యర్థులకు టిక్కెట్లు లభించాయి. 243 మంది సభ్యుల బిహార్ అసెంబ్లీకి రెండు విడతలుగా నవంబర్ 6,11 తేదీల్లో పోలింగ్ జరుగనుండగా, నవంబర్ 14న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
ఎన్నికల వేళ బీజేపీలో చేరిన ఫోక్ సింగర్ మైథిలీ ఠాకూర్
71 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా విడుదల
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి