Maithili Thakur: ఎన్నికల వేళ బీజేపీలో చేరిన ఫోక్ సింగర్ మైథిలీ ఠాకూర్
ABN , Publish Date - Oct 14 , 2025 | 07:22 PM
బిహార్‌లోని మధుబని జిల్లా బేనిపట్టికి చెందిన ఠూకూర్ గతంలో రాజకీయాల్లోకి చేరాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. తన సొంత నియోజకవర్గం నుంచి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందన్నారు. తన నియోజకవర్గంతో ఎంతో అనుబంధం ఉందని చెప్పారు.
పాట్నా: యువ ఫోక్ సింగర్ (Folk Singer)గా మంచి పేరు తెచ్చుకున్న మైథిలి ఠాకూర్ (Miithili Thakur) బిహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections) వేళ భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. 25 ఏళ్ల మైథిలీ ఠాకూర్‌కు దర్బంగాలోని అలీనగర్ అసెంబ్లీ నియోజకర్గం నుంచి బీజేపీ టిక్కెట్ కేటాయించే అవకాశం ఉంది.
బిహార్‌లోని మధుబని జిల్లా బేనిపట్టికి చెందిన ఠూకూర్ గతంలో రాజకీయాల్లోకి చేరాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. తన సొంత నియోజకవర్గం నుంచి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందన్నారు. తన నియోజకవర్గంతో ఎంతో అనుబంధం ఉందని చెప్పారు.
ఎవరీ మైథిలీ ఠాకూర్?
మైథిలీ ఠాకూర్‌ను బిహార్ 'స్టేట్ ఐకాన్'గా ఎన్నికల కమిషన్ నియమించింది. రాష్ట్రానికి సాంస్కృతిక అంబాసిడర్‌గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. క్లాసికల్, ఫోక్ సంగీతంలో శిక్షణ పొందిన ఆమెకు బిహార్ ఫోక్ మ్యూజిక్‌కు చేసిన సేవలకు సంగీత నాటక అకాడమీ 2021లో ఉస్తాద్ బిస్మిల్మా ఖాన్ యువ పురస్కారం అందజేసింది.
మోదీ ప్రశంసలు
మైథిలీ ఠాగూర్ గతంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు అందుకున్నారు. 2024 జనవరిలో అయోధ్య రామాలయం ప్రారంభోత్సవంలో ఆమె పాడిన 'మా శబరి' పాటను ప్రధాని ప్రశంసించారు.
ఇవి కూడా చదవండి..
లాలూ ఇచ్చిన టిక్కెట్లను వెనక్కి తీసుకున్న తేజస్వి.. ఆసక్తికర పరిణామం
71 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా విడుదల
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి