India Pakistan Tensions: ఈ సారి మామూలుగా ఉండదు, ఊచకోతే.. మరో పహల్గాం పన్నాగం నేపథ్యంలో పాక్‌కు స్ట్రాంగ్ వార్నింగ్
ABN , Publish Date - Oct 14 , 2025 | 07:33 PM
ఈ సారి మామూలుగా ఉండదు. ఊచకోతే.. అని పాకిస్థాన్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు భారత వెస్ట్రన్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్. పాకిస్థాన్ మళ్లీ పహల్గాం లాంటి ఉగ్రవాద దాడులు చేపట్టే అవకాశం ఉందని..
శ్రీనగర్, అక్టోబర్ 14, 2025: ఈ సారి మామూలుగా ఉండదు. ఊచకోతే.. అని పాకిస్థాన్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు భారత వెస్ట్రన్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్. పాకిస్థాన్ మళ్లీ పహల్గాం లాంటి ఉగ్రవాద దాడులు చేపట్టే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. వెయ్యి ప్రగల్భాలు పలికి భారత్‌ను భయపెట్టలానుకునే పాక్ మార్గదర్శక సూత్రం ప్రకారం అక్కడి నేతలు పిచ్చి కూతలు కూస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌కు భారత్‌తో పూర్తి స్థాయి యుద్ధం చేసే సామర్థ్యం లేదని, కానీ సరిహద్దు దాటి పిచ్చి చేష్టలు చేస్తుంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఏప్రిల్ 23, 2025న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం బైసారన్ మెడోలో జరిగిన ఉగ్రవాద దాడిని ఉదాహరణగా పేర్కొన్న కటియార్, దాని మాదిరిగా మళ్లీ దాడులు జరిగితే 'ఆపరేషన్ సిందూర్ 2.0' మరింత ఘాతకంగా, శక్తివంతంగా జరుగుతుందని హెచ్చరించారు. మే 2025లో జరిగిన మొదటి 'ఆపరేషన్ సిందూర్'లో పాకిస్తాన్ ఫార్వర్డ్ పోస్టులు, ఎయిర్ బేస్‌లు ధ్వంసమయ్యాయి. ఈ ప్రతిస్పందన పాకిస్తాన్‌కు భారీ నష్టాలు కలిగించిందని ఆయన తెలిపారు.
'ఈసారి మన చర్య మునుపటి కంటే మరింత ఘోరంగా ఉంటుంది. మరింత శక్తివంతంగా ఉంటుంది. ఆపరేషన్ సిందూర్ 2.0 మరింత భయంకరంగా ఉండాలి. దీనిపై సందేహం లేదు' అని కటియార్ చెప్పారు. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇటీవల 'భారత్‌తో యుద్ధ అవకాశాలు చాలా రియల్' అని చెప్పిన నేపథ్యంలో కటియార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సైనికులు, ప్రజలు జాగ్రత్తగా ఉండి, జాతీయ భద్రతకు సహకరించాలని కటియార్ పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నకిలీ మద్యం కేసులో మరో కీలక పరిణామం
కొత్త డీజీపీగా ఓం ప్రకాశ్ సింగ్
దీపావళి పండగ ఎప్పుడు చేసుకోవాలి..?
For More National News And Telugu News