Operation Sindoor: పాకిస్తాన్ సైనిక పోస్టుల ధ్వంసం.. ఇండియన్ ఆర్మీ వీడియో వైరల్..
ABN , Publish Date - May 09 , 2025 | 09:40 AM
ఆపరేషన్ సిందూర్‌తో భారత్-పాక్ మధ్య పూర్తి స్థాయి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ సైనిక పోస్టును ధ్వంసం చేస్తున్న మొట్టమొదటి అధికారిక వీడియోను భారత ఆర్మీ.. తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది..

ఆపరేషన్ సిందూర్‌తో భారత్-పాక్ మధ్య పూర్తి స్థాయి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. భారత ఆర్మీ ముప్పేట దాడితో ఉక్కిరిబిక్కిరవుతున్న పాకిస్తాన్.. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో సరిహద్దు వెంబడి కాల్పులకు తెగబడడం, పాత వీడియోలతో అసత్య ప్రచారం చేయడం వంటి కుటిల యత్నాలకు పాల్పడుతోంది. అయితే ఎప్పటికప్పుడు పాక్‌కు భారత్ గట్టిగా బుద్ధి చెబుతోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ సైనిక పోస్టును ధ్వంసం చేస్తున్న మొట్టమొదటి అధికారిక వీడియోను భారత ఆర్మీ.. తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది.
ఆపరేషన్ సిందూర్‌లో (Operation Sindoor) పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ (Indian Army) విరుచుపడుతోంది. దీంతో పాకిస్తాన్ కూడా భారత సరిహద్దులోని ప్రాంతాల్లో కాల్పులకు తెగపడుతోంది. జమ్మూలోని పలు ప్రాంతాల్లో పాకిస్తాన్ (Pakistan) భూభాగంపై నుంచి పదుల సంఖ్యలో డ్రోన్లు జమ్మూ వైపు దూసుకురావడం కనిపించింది. ఆ డ్రోన్లు ఉధంపూర్, జమ్మూ, అఖ్నూర్, పఠాన్‌కోట్ వైపు దూసుకొచ్చాయి. అయితే డ్రోన్ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. సుమారు 50 పాకిస్తాన్ డ్రోన్‌లను కూల్చేసింది. అలాగే నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాకిస్తాన్ సైనిక పోస్టులను ధ్వంసం చేసింది. ఇందుకు సంబంధించిన మొట్టమొదటి అధికారిక వీడియోను భారత ఆర్మీ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. సైనిక పోస్టులను కూల్చేందుకు యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులను ఉపయోగించినట్లు సైనిక వర్గాలు తెలిపాయి.
మరోవైపు జమ్మూ కాశ్మీర్‌లోని సాంబా జిల్లాలో పాకిస్తాన్ సైన్యం సరిహద్దు దాటి చొరబాటుకు యత్నించింది. అయితే వారి ప్రయత్నాలను భారత సరిహద్దు భద్రతా దళం (BSF) భగ్నం చేసింది. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో వైమానిక దాడుల కారణంగా సరిహద్దు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. శ్రీనగర్, జమ్మూ, పంజాబ్, రాజస్థాన్‌లోని తదితర ప్రాంతాల్లో రాత్రంతా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే ఎక్కడా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని తెలుస్తోంది. కాగా, భారత ఆర్మీ విడుదల చేసిన పాకిస్తాన్ సైనిక పోస్టులను ధ్వంసం వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇవీ చదవండి:
భారత్, పాక్ యుద్ధం.. కిమ్ సపోర్టు ఎవరికి..
పాక్ దాడులపై ఎక్స్‌లో భారత ఆర్మీ పోస్ట్
వణికిపోతున్న పాక్.. అజ్ఞాతంలో ప్రధాని..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి