India Pakistan War: పాక్‌కు దెబ్బ మీద దెబ్బ.. కీలక మిలటరీ పోస్ట్ ధ్వంసం
ABN , Publish Date - May 10 , 2025 | 08:55 AM
Indian Forces: భారత్ మీదకు దాడులకు తెగబడుతున్న పాకిస్థాన్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇటు అటాక్‌లో విఫలమవుతున్న దాయాది.. అటు డిఫెన్స్‌లోనూ చతికిలపడుతోంది.
ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్న పాకిస్థాన్‌కు వరుస షాకులు తగులుతున్నాయి. భారత్‌పై తీవ్రంగా దాడులకు తెగబడుతున్న దాయాది పూర్తిగా ఫ్లాప్ అవుతోంది. పాక్ దాడుల్ని మన రక్షణ వ్యవస్థ సమర్థంగా తిప్పికొడుతోంది. ఆ దేశ డ్రోన్లు, క్షిపణులను గాల్లోనే కూల్చేస్తూ బెదరగొడుతోంది. దీనికి తోడు కౌంటర్ అటాక్‌తో ప్రత్యర్థికి చుక్కలు చూపిస్తోంది భారత ఆర్మీ. తాజాగా పాక్‌కు మరో షాక్ ఇచ్చింది. జమ్మూలోని దాయాది మిలటరీ పోస్ట్‌ను ధ్వంసం చేశారు మన సైనికులు. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
పేల్చేశారు
భారత్‌లో ఉద్రిక్తతలు పెంచేందుకు ప్రయత్నిస్తున్న పాకిస్థాన్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. డ్రోన్లు, మిస్సైల్స్ దాడులతో పాటు నియంత్రణ రేఖ వెంబడి వరుస కాల్పులకు తెగబడుతున్న దాయాదికి మన సైన్యం గట్టిగా బుద్ధి చెబుతోంది. ఈ క్రమంలోనే బోర్డర్‌లో శత్రు దేశానికి చెందిన పలు సైనిక పోస్టులను భారత భద్రతా బలగాలు ధ్వంసం చేస్తున్నాయి. తాజాగా జమ్మూలోని పాక్ పోస్ట్‌ను పేల్చేసింది మన ఆర్మీ. అలాగే టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్‌ను కూడా ధ్వంసం చేసింది. ఇక్కడి నుంచే భారత్ మీదకు పాక్ డ్రోన్స్‌ను వదులుతోందని సమాచారం. పాక్ మిలటరీ పోస్ట్ ధ్వంసమైన వీడియోలు నేషనల్ మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్స్.. పాక్ పనైపోయిందని.. తట్టాబుట్టా సర్దుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదని అంటున్నారు. ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చెబుతున్నారు. దాయాదికి నిద్రలేకుండా చేస్తున్నారని మెచ్చుకుంటున్నారు.
ఇవీ చదవండి:
పంజాబ్‌లో పాకిస్తాన్ డ్రోన్ దాడి
త్రివిధ దళాధిపతులతో రాజ్‌నాథ్ భేటీ
సైన్యం కదలికలపై ప్రత్యక్ష ప్రసారాలొద్దు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి