Share News

Operation Sindhoor: ఇకపై ఏ ఉగ్రదాడినైనా యుద్ధ చర్యగా పరిగణిస్తాం: పాక్‌స్థాన్‌కు భారత్ సీరియస్ వార్నింగ్

ABN , Publish Date - May 10 , 2025 | 04:43 PM

దేశ భద్రతా విషయంలో మరింత కఠిన వైఖరి ప్రదర్శించాలని అత్యున్నత స్థాయి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత ప్రయోజనాలను దెబ్బతీసేలా భవిష్యత్తులో ఎలాంటి ఉగ్రవాద చర్యలకు పాల్పడినా దానిని యుద్ధ చర్యగా పరిగణించాలని సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు ఆ వర్గాలు వెల్లడించాయి.

Operation Sindhoor: ఇకపై ఏ ఉగ్రదాడినైనా యుద్ధ చర్యగా పరిగణిస్తాం: పాక్‌స్థాన్‌కు భారత్ సీరియస్ వార్నింగ్
PM Narendra Modi

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌కు భారత్ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఇకపై ఏ ఉగ్రదాడినైనా యుద్ధ చర్యగా పరిగణిస్తామని హెచ్చరించింది. పాకిస్థాన్ రెచ్చిపోతే అంతకు అంత ప్రతిదాడితో విరుచుకుపడాలని నిర్ణయించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన త్రివిధ దళాధిపతులతో జరిపిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పాక్‌పై పూర్తి స్థాయి యుద్ధానికి మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఇకపై ఏ ఉగ్రదాడినైనా యుద్ధ చర్యగా పరిగణించాలని, అంతే తీవ్ర స్థాయిలో బదులివ్వాలని ప్రధాని దిశానిర్దేశం చేశారని తెలిసింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ ఈ కీలక సమావేశంలో పాల్గొన్నారు.

Indian Ballistic Missiles: ఈ భారత క్షిపణులు శుత్రువుల గుండెల్లో గుబులు పుట్టిస్తాయ్..వీటి స్పెషల్ ఏంటంటే..


భారత్‌లో 26 లొకేషన్లపై పాక్ డ్రోన్ దాడులకు ప్రతిగా శనివారం తెల్లవారు జామున నాలుగు పాక్ ఎయిర్‌బేస్‌లపై భారత్ దాడులు చేసింది. అనంతరం నేపథ్యంలో మోదీ ఈ సమావేశం నిర్వహించారు. దేశ భద్రతా విషయంలో మరింత కఠిన వైఖరి ప్రదర్శించాలని ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత ప్రయోజనాలను దెబ్బతీసేలా భవిష్యత్తులో ఎలాంటి ఉగ్రవాద చర్యలకు పాల్పడినా దానిని యుద్ధ చర్యగా పరిగణించాలని సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు ఆ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఇకపై ఉగ్రవాద చర్యలను కేవలం అంతర్గతా భద్రతా చర్యలుగానే పరిగణించలేమని, ప్రతిస్పందన అత్యంత భీకరంగా ఉంటుందనే ప్రత్యక్ష హెచ్చరిక సందేశాన్ని భారత్ ఇచ్చినట్లయింది.


ఇవి కూడా చదవండి

Operation Sindoor: భారత్, పాక్ యుద్ధం అప్‌డేట్స్ మీ ఫోన్లో చూడాలనుకుంటే ఇలా చేయండి..

India Pakistan Tensions: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ.. దేశంలో నిత్యావసరాలపై కీలక ప్రకటన

India Pakistan Tension: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ జమ్మూ నుంచి ఢిల్లీకి మూడు ప్రత్యేక రైళ్లు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి


సైన్యానికి మద్దతుగా..

Updated Date - May 10 , 2025 | 05:06 PM