Share News

Indian Ballistic Missiles: ఈ భారత క్షిపణులు శుత్రువుల గుండెల్లో గుబులు పుట్టిస్తాయ్..వీటి స్పెషల్ ఏంటంటే..

ABN , Publish Date - May 10 , 2025 | 04:37 PM

శత్రువులకు దడ పుట్టించే బలమైన ఆయుధ శక్తిని భారత్ కలిగి ఉంది. అత్యాధునిక సాంకేతికతతో అభివృద్ధి చేసిన బాలిస్టిక్ క్షిపణులు ఇప్పుడు దేశ రక్షణకు అస్త్రాలుగా మారాయి. ఇటీవల పాకిస్తాన్ దాడులను బాలిస్టిక్ క్షిపణులు తిప్పికొట్టాయి. అయితే వీటి స్పెషల్ ఏంటనే తదితర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Indian Ballistic Missiles: ఈ భారత క్షిపణులు శుత్రువుల గుండెల్లో గుబులు పుట్టిస్తాయ్..వీటి స్పెషల్ ఏంటంటే..
Indian Ballistic Missiles special

భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఇరు దేశాల్లో కూడా దాడులు జరుగుతున్నాయి. ఇదే సమయంలో పాకిస్తాన్ దాడులను భారత్ చాకచక్యంగా తిప్పికొడుతోంది. ఈరోజు కూడా పాకిస్తాన్ చేసిన దాడులను భారత వైమానిక రక్షణ వ్యవస్థ ఈజీగా కూల్చి వేసింది. అందుకోసం భారత్ బాలిస్టిక్ క్షిపణులను ఉపయోగించింది. మే 8, 9 తేదీల్లో రాత్రి పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులతో ఇండియాపై దాడులకు దిగగా, వీటిని భారత బాలిస్టిక్ క్షిపణులు అడ్డుకుని పేల్చేశాయి.

రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో పాకిస్తాన్ ప్రయోగించిన అబ్దాలి బాలిస్టిక్ క్షిపణిని భారత సైన్యం పేల్చి వేసింది. ఈ క్షిపణి పరిధి 180 నుంచి 200 కిలోమీటర్లు. భారత సైన్యం దగ్గర ఇలాంటివి అనేక బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి. శత్రు దేశాల గుండెల్లో భయం కలిగించే ఈ క్షిపణులు, భారత్‌కు రణరంగంలో అగ్రగామిగా నిలుస్తున్నాయి. అయితే వీటి స్పెషల్ ఏంటి, ఎలా పనిచేస్తాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


బాలిస్టిక్ క్షిపణులు అంటే ఏంటి

బాలిస్టిక్ క్షిపణులు రాకెట్ చోదక ఆయుధాలు. ఇవి దూరం నుంచి వచ్చే లక్ష్యాలను సులభంగా గుర్తించి పేల్చేస్తాయి. వీటిని అనేక ప్రాంతాల నుంచి కూడా ప్రయోగించుకోవచ్చు. అంటే నేల ఉపరితలం, విమానం, ఓడ, జలాంతర్గామి వంటి ప్రాంతాల నుంచి కూడా ఉపయోగించవచ్చు. సుదూర లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం, ​​అధిక వేగం, పేలోడ్ సామర్థ్యం వంటి లక్షణాలతో బాలిస్టిక్ క్షిపణులు సిద్ధంగా ఉన్నాయి.

ఇవి ఎలా పని చేస్తాయి

బాలిస్టిక్ క్షిపణి ప్రత్యేకత ఏమిటంటే ఇందులో అమర్చిన రాకెట్ ఇంజన్లు క్షిపణిని పైకి వేగవంతం చేసి అధిక వేగంతో తీసుకెళ్లడానికి శక్తిని ఉత్పత్తి చేస్తాయి. దీని తరువాత ఇంజిన్ ఆగిపోతుంది. క్షిపణి రెండో దశలోకి ప్రవేశిస్తుంది. ఈ సమయంలో అది ప్రధానంగా గురుత్వాకర్షణ ప్రభావంతో అంతరిక్షం గుండా దూసుకెళ్తుంది. చివరి దశలో అది మళ్లీ భూ వాతావరణంలోకి ప్రవేశించి దాని నిర్దేశిత లక్ష్యం వైపు చేరుకుంటుంది. ఈ క్రమంలో పరిధి ఆధారంగా బాలిస్టిక్ క్షిపణులు ప్రధానంగా ఐదు రకాలుగా ఉన్నాయి. వాటిలో TBM, SRBM, MRBM, IRBM, ICBM ఉన్నాయి.


  • TBM అంటే టాక్టికల్ బాలిస్టిక్ క్షిపణి, దీని పరిధి 300 కిలోమీటర్ల కంటే తక్కువ

  • SRBM అంటే స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి, దీని పరిధి 300 నుంచి 1000 కిలోమీటర్లు

  • MRBM అంటే మీడియం రేంజ్ బాలిస్టిక్ క్షిపణి, దీని పరిధి 1000 నుంచి 3500 కిలోమీటర్లు

  • IRBM అంటే ఇంటర్-మీడియం రేంజ్ బాలిస్టిక్ క్షిపణి, దీని పరిధి 3,500 నుంచి 5,500 కిలోమీటర్లు

  • ICBM అంటే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి, దీని దాడి పరిధి లేదా పరిధి 5,500 కిలోమీటర్ల కంటే ఎక్కువ

దీర్ఘ, మధ్యస్థ-శ్రేణి బాలిస్టిక్ క్షిపణులు ప్రత్యేకంగా అణ్వాయుధ పేలోడ్‌లను మోసుకెళ్లడానికి రూపొందించబడ్డాయి.


ఇవి కూడా చదవండి

India Pakistan Tensions: పాకిస్తాన్‎ను పట్టించుకోని అమెరికా..దాడులు ఆపించాలని వేడుకున్నా కూడా..


Operation Sindoor: భారత్, పాకిస్తాన్ యుద్ధంపై జాన్వీ ఎమోషనల్ పోస్ట్..

Operation Sindoor: భారత్, పాక్ యుద్ధం అప్‌డేట్స్ మీ ఫోన్లో చూడాలనుకుంటే ఇలా చేయండి..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి


థియేటర్లో అదరగొట్టిన జంట..

Updated Date - May 10 , 2025 | 04:51 PM