Share News

Boy got toyota fortuner suv: నాలుగేళ్ల బాలుడికి జాక్‌పాట్.. లక్కీ డ్రాలో రూ.53 లక్షల కారు !

ABN , Publish Date - Oct 09 , 2025 | 01:03 PM

అదృష్ఠం అనేది ఏ రూపంలో ఎవరిని, ఎలా వరిస్తుందో ఎవ్వరం చెప్పలేము. అయితే అలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రం అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తాం. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఓ నాలుగేళ్ల బాలుడు జాక్ పాట్ కొట్టాడు. కేవలం రూ.201 తో లక్కీ డ్రా కూపన్ కొనుగోలు చేస్తే..

Boy got toyota fortuner suv: నాలుగేళ్ల బాలుడికి జాక్‌పాట్.. లక్కీ డ్రాలో రూ.53 లక్షల కారు !

అదృష్ఠం అనేది ఏ రూపంలో ఎవరిని, ఎలా వరిస్తుందో ఎవ్వరం చెప్పలేము. అయితే అలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రం అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తాం. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఓ నాలుగేళ్ల బాలుడు జాక్ పాట్ కొట్టాడు. కేవలం రూ.201 తో లక్కీ డ్రా కూపన్ కొనుగోలు చేస్తే.. ఊహించని రీతిలో భారీ గిఫ్ట్ దక్కింది. ఈ ఘటన బర్హాన్‌పూర్ జిల్లా శిలాంపుర ప్రాంతంలో చోటుచేసుకోగా నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే..


ఇటీవల దసరా సందర్భంగా బర్హాన్‌పూర్‌ లోని అభాపురి ప్రాంతంలో "సర్కార్ ధామ్" ఆధ్వర్యంలో భారీ స్థాయిలో గర్బా ఉత్సవాలు( Garba festival) నిర్వహించారు. స్థానికులు పెద్ద ఎత్తున ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే నిర్వాహకులు లక్కీ డ్రా కూపన్ స్కీమ్ ను కూడా ప్రవేశపెట్టారు. అందులో భాగంగా శిలాంపురకు చెందిన కిరణ్ రాయిక్వార్ అనే మహిళ తన నాలుగేళ్ల మనవడు మేధాన్ష్ పేరుతో రూ.201 చెల్లించి ఒక లాటరీని కొనుగోలు చేశారు.


తరువాత రోజు నిర్వహించిన లక్కీ డ్రాలో మేధాన్ష్ (Medhansh)పేరు ఉన్న కూపన్ విన్నర్ గా ఎంపికైంది. బహుమతిగా టయోటా ఫార్చ్యూనర్ SUV దక్కడంతో వారి ఫ్యామిలీ సంతోషం వ్యక్తం చేసింది. దాదాపు రూ. 53 లక్షల విలువైన లగ్జరీ కారు.. కేవలం రూ.201 తో దక్కించుకోవడం అదృష్టమని, ఆ పిల్లడిని లక్కీ బాయ్ అని అంటూ స్థానికులు తెగ పొగిడేస్తున్నారు. అయితే మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh) లో లాటరీలపై నిషేధం ఉంది. కానీ సాంస్కృతిక లేదా ధార్మిక ఉత్సవాల సందర్భంగా నిర్వహించే లక్కీ డ్రాలుపై మాత్రం ఆంక్షలు లేవు. ఈ సంఘటన తర్వాత మేధాన్ష్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఇవి కూడా చదవండి..

ఈ కార్మికులు చాలా తెలివైన వాళ్లు.. బస్తాను పైకి ఎలా పంపుతున్నారో చూడండి..

ఈ ఫొటోలో రెండో కారు కూడా ఉంది.. ఎక్కడ.. 6 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 09 , 2025 | 01:04 PM