Gujarat: భారత్-పాకిస్తాన్ సరిహద్దులో పేలిన డ్రోన్.. అప్రమత్తమైన భద్రతా దళాలు..
ABN , Publish Date - May 08 , 2025 | 01:05 PM
గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఇండియా-పాకిస్తాన్ సరిహద్దు సమీపంలోని ఖావ్డా ఇండియా బ్రిడ్జి సరిహద్దు ప్రాంతంలో గురువారం ఉదయం డ్రోన్ పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు, వైమానిక దళ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు..
ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత ఆర్మీ విరుకుచుపడింది. ఈ దాడులతో ప్రస్తుతం భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో గుజరాత్‌లోని కచ్ జిల్లాలోని ఇండియా-పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో అనుమానాస్పద పేలుడు సంభవించింది. దీంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి.
గుజరాత్‌లోని (Gujarat) కచ్ జిల్లాలో ఇండియా-పాకిస్తాన్ సరిహద్దు సమీపంలోని ఖావ్డా ఇండియా బ్రిడ్జి సరిహద్దు ప్రాంతంలో గురువారం ఉదయం డ్రోన్ పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు, వైమానిక దళ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే డ్రోన్ సరిహద్దు అవతల నుంచి వచ్చిందా లేదా అనేది ఇంకా నిర్ధారించబడలేదు. అయితే అనుమానాస్పద డ్రోన్ హైటెన్షన్ విద్యుత్ లైన్‌ను ఢీకొట్టడంతో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది.
భారత్-పాక్ (India-Pakistan War) మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో డ్రోన్ పేలుడుకు (Drone explosion), పాకిస్తాన్‌కు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. భారత్ దాడులను జీర్ణించుకోలేని పాకిస్తాన్.. నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరుపుతోంది. గురువారం కూడా కాల్పులను కొనసాగించింది. అయితే భారత ఆర్మీకి వారికి దీటుగా సమాధానం ఇస్తోంది.
పాకిస్తాన్ తిరిగి దాడులు చేయనుందనే సమాచరంతో భారత్ అప్రమైంది. సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించింది. పోలీసు సిబ్బందికి సెలవులు రద్దు చేయడంతో పాటూ సెలవులో ఉన్న అధికారులను వెంటనే విధుల్లో హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే సరిహద్దు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే..
పాక్ కవ్వింపు చర్యలు.. తిప్పికొట్టిన భారత్ సైన్యం..
న్యాయం జరిగింది: సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా కుటుంబం
For More AP News and Telugu News