Share News

Delhi Police Chief: ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు గుడ్‌బై.. ఆ దాడి తర్వాత రియాక్షన్

ABN , Publish Date - Aug 21 , 2025 | 05:45 PM

ఢిల్లీ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కిపోయాయి. ఎందుకంటే ఢిల్లీ సీఎం రేఖా గుప్తా మీద ఓ పబ్లిక్ మీటింగ్‌ సమయంలో దాడి జరిగింది. ఈ ఘటన తర్వాత, తాజాగా కేంద్ర హోంశాఖ (MHA) కీలక నిర్ణయం తీసుకుంది.

Delhi Police Chief: ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు గుడ్‌బై.. ఆ దాడి తర్వాత రియాక్షన్
Delhi Police Chief

ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై నిన్న ఊహించని విధంగా దాడి జరిగింది. అది కూడా పబ్లిక్ మీటింగ్‌లో. ఈ ఘటన తర్వాత ఢిల్లీ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కీలక మార్పు వచ్చింది. కొత్త పోలీస్ కమిషనర్‌గా సీనియర్ IPS ఆఫీసర్ సతీష్ గోల్చాను (Satish Golcha) నియమించారు. ఈ విషయం ఇప్పుడు ఢిల్లీలో హాట్ టాపిక్‌గా మారింది.


ఇకపై ఢిల్లీ పోలీస్ కమిషనర్‌

దీనికి సంబంధించి ఆగస్టు 21న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. సతీష్ గోల్చా ఇప్పుడు ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు తీసుకుంటారు. సతీష్ గోల్చా, ప్రస్తుతం ఢిల్లీ డీజీ (ప్రిజన్స్)గా ఉన్న ఆయన, ఇకపై ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా వ్యవహరిస్తారు. ఆయన చార్జ్ తీసుకున్న రోజు నుంచి ఈ నియామకం అమలులోకి వస్తుందని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు.


21 రోజుల్లోనే..

సతీష్ గోల్చా 1992 బ్యాచ్ IPS ఆఫీసర్. ఇప్పటివరకు ఢిల్లీ జైళ్ల డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. ఆయన స్థానంలో ఇప్పటివరకు ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా ఉన్న SBK సింగ్‌ను తొలగించారు. SBK సింగ్‌కు ఆగస్టు 1 నుంచి హోం గార్డ్స్ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. కానీ, రేఖా గుప్తాపై దాడి జరిగిన తర్వాత 21 రోజుల్లోనే ఈ భారీ మార్పు చేశారు. ఇది సాధారణ మార్పు కాదని, దీని వెనుక ఏదో పెద్ద కారణం ఉందని చర్చించుకుంటున్నారు.


ఎవరు చేశారు

ఈ దాడి ఎందుకు జరిగింది? ఎవరు చేశారు? అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. పబ్లిక్ మీటింగ్‌లో సీఎం రేఖా గుప్తాపై దాడి జరగడం అంటే చిన్న విషయం కాదు. ఇది ఢిల్లీలో భద్రతా వ్యవస్థపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తింది. అందుకే కేంద్ర ప్రభుత్వం వెంటనే యాక్షన్ తీసుకుని, సతీష్ గోల్చా లాంటి సీనియర్ అధికారిని ఈ కీలక పదవిలో నియమించినట్టు కనిపిస్తోంది.


మూడు దశాబ్దాల అనుభవం

సతీష్ గోల్చాకు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. ఢిల్లీలో క్రమశిక్షణ, భద్రతా వ్యవస్థను మెరుగుపరచడంలో ఆయన గతంలో చేసిన పనులు చాలా మందికి తెలుసు. ఇప్పుడు ఈ కొత్త బాధ్యతలతో ఆయన ఢిల్లీ పోలీస్ వ్యవస్థను ఎలా నడిపిస్తారో చూడాలి. ముఖ్యంగా, రేఖా గుప్తాపై జరిగిన దాడి కేసును ఆయన ఎలా హ్యాండిల్ చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది.


ఇవి కూడా చదవండి

అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?

మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 21 , 2025 | 06:05 PM