Share News

Samir Modi: అత్యాచారం కేసులో లలిత్ మోదీ సోదరుడి అరెస్ట్..

ABN , Publish Date - Sep 18 , 2025 | 09:06 PM

వ్యాపారవేత్త, ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీ సోదరుడు సమీర్ మోదీ అరెస్ట్ అయ్యారు. అత్యాచారం కేసులో ఢిల్లీ పోలీసులు ఆయన్ను గురువారం సాయంత్రం ఇందిరాగాంధీ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు.

Samir Modi: అత్యాచారం కేసులో లలిత్ మోదీ సోదరుడి అరెస్ట్..

ఢిల్లీ: వ్యాపారవేత్త, ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీ సోదరుడు సమీర్ మోదీ అరెస్ట్ అయ్యారు. అత్యాచారం కేసులో ఢిల్లీ పోలీసులు ఆయన్ను గురువారం సాయంత్రం ఇందిరాగాంధీ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. విదేశాలకు వెళ్తున్న సమయంలో సమీర్‌ను కస్టడీలోకి తీసుకున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. సమీర్‌తో గతంలో సహజీవనం చేసిన మహిళ ఫిర్యాదు మేరకే ఈ అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది.


ఓ మహిళ 5 రోజుల క్రితం పోలీసులను ఆశ్రయించి సమీర్ మోదీపై (Samir Modi) ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆమె ఫిర్యాదు మేరకు.. సమీర్‌పై సౌత్‌ ఈస్ట్‌ ఢిల్లీలో (South East Delhi) అత్యాచారం, బెదిరింపులు తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సమీర్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా.. ఒక రోజు జ్యుడిషియల్ కస్టడీ విధించినట్లు తెలిసింది. సమీర్ గతేడాదీ ఇలాగే వార్తల్లో నిలిచాడు.


తన తల్లి బినా మోదీతో వారసత్వ వివాదం కేసులో పోలీసులను ఆశ్రయించాడు. తన తల్లి నుంచి బెదిరింపులు వస్తున్నాయని, తనకు రక్షణ కల్పించాలని కోరాడు. సమీర్ తండ్రి కేకే మోదీ 2019లో మరణించారు. ఆ తర్వాత రూ. 11,000 కోట్ల వారసత్వ ఆస్తి పంపిణీ విషయంలో వారి కుటుంబంలో అప్పట్లో గొడవలు తలెత్తాయి. తన తండ్రి అమలు చేసిన ట్రస్ట్ డీడ్ ప్రకారం.. ఆస్తులు, డబ్బుల పంపిణీ విషయంలో తన తల్లి విఫలమయ్యారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. మోదీకేర్ అనే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ వ్యవస్థాపకుడైన సమీర్.. ప్రస్తుతం ఆ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

దసరాతో దశ తిరగనున్న రాశులు ఇవే..

జగన్ చెంప పగలగొట్టాలి.. అచ్చెన్న ఫైర్

For More National News And Telugu News

Updated Date - Sep 18 , 2025 | 09:40 PM