Share News

Jammu and Kashmir RS Polls: జమ్మూకశ్మీర్ రాజ్యసభ పోల్స్‌కు కాంగ్రెస్ దూరం

ABN , Publish Date - Oct 12 , 2025 | 09:03 PM

నాలుగు రాజ్యసభ సీట్లలో మొదటి రెండింట్లో ఒక స్థానంలో పోటీ చేయాలని కాంగ్రెస్ ఆశించినప్పటికీ రాజ్యసభకు పోటీ చేసే ముగ్గురు అభ్యర్థుల పేర్లను నేషనల్ కాన్ఫరెన్స్ ఇప్పటికే ప్రకటించింది.

Jammu and Kashmir RS Polls: జమ్మూకశ్మీర్ రాజ్యసభ పోల్స్‌కు కాంగ్రెస్ దూరం
Congress not to contest Jammu and Kashmir Rajya Sabha Polls

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లోని నాలుగు రాజ్యసభ స్థానాలకు అక్టోబర్ 24న జరగనున్న ఎన్నికలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ (Congress) పార్టీ నిర్ణయించింది. ఈ విషయాన్ని జమ్మూకశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (PCC) అధ్యక్షుడు తారిక్ హమీద్ కర్రా ఆదివారంనాడు ప్రకటించారు. అలెయెన్స్ అగ్రిమెంట్ ప్రకారం 'సేఫ్ సీట్' (Safe Seat) కేటాయించ లేమని నేషనల్ కాన్ఫరెన్స్ (NC) తేల్చిచెప్పడంతో పోటీకి దూరంగా ఉండాలని తమ పార్టీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు.


నాలుగు రాజ్యసభ సీట్లలో మొదటి రెండింట్లో ఒక స్థానంలో పోటీ చేయాలని కాంగ్రెస్ ఆశించినప్పటికీ రాజ్యసభకు పోటీ చేసే ముగ్గురు అభ్యర్థుల పేర్లను నేషనల్ కాన్ఫరెన్స్ ఇప్పటికే ప్రకటించింది. దీంతో నాలుగో సీటుకు తమ అభ్యర్థిని నిలపరాదని కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందని కర్రా తెలిపారు. తమ భాగస్వామ్య పార్టీకే ఆ సీటును కూడా వదలివేస్తున్నట్టు చెప్పారు.


కాగా, నేషనల్ కాన్ఫరెన్స్ అసెంబ్లీలో తమకున్న బలం ఆధారంగా భాగస్వామ్య పార్టీల మద్దతు లేకున్నా సునాయాసంగా 3 సీట్లు గెలుచుకోగలుగుతుంది. అయితే నాలుగో సీటు గెలుచుకోవాలంటే బీజేపీ వ్యతిరేక ఓటును తమవైపు తిప్పుకోవాల్సి ఉంది. అసెంబ్లీలో పీడీపీకి ముగ్గురు ఎమ్మెల్యేల బలం ఉండగా, పీపుల్స్ కాన్ఫరెన్స్, అవామి ఇత్తెహాద్ పార్టీ, ఆప్‌కు ఒక్కో ఎమ్మెల్యే చొప్పున ఉన్నారు.


ఇవి కూడా చదవండి..

కాంగ్రెస్‌కు 50 కంటే ఎక్కువ, 70 కంటే తక్కువ సీట్లు

ఎన్డీయే డీల్ ఓకే.. జేడీయూ-బీజేపీ చెరిసగం..

For More National News And Telugu News

Updated Date - Oct 12 , 2025 | 09:05 PM