Election Commission: గుర్తింపు లేని రాజకీయ పార్టీలపై ఈసీ వేటు..
ABN , Publish Date - Aug 09 , 2025 | 03:25 PM
334 పేరుకు మాత్రమే పార్టీలని, వీటికి భౌతికంగా ఎలాంటి కార్యాలయాలు అందుబాటులో లేవని ఈసీ వెల్లడించింది. ఇప్పటివరకు దేశంలో 2,854 గుర్తింపుపొందని పార్టీలను ఈసీ గుర్తించిందని చెప్పకొచ్చింది. తాజా చర్యతో ఆ సంఖ్య 2,520కి తగ్గిందని తెలిపారు.
ఢిల్లీ: దేశంలో గుర్తింపు లేని రాజకీయ పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. 334 రాజకీయ పార్టీలను ఎన్నికల సంఘం జాబితా నుంచి తొలిగించింది. వాటిని గుర్తింపు పొందని పార్టీలకు నిర్ధారించినట్లు ఈసీ చెప్పుకొచ్చింది. 2019 నుంచి ఆ పార్టీలు ఎన్నికల్లోనూ పోటీ చేయలేదని వివరించింది.
334 పేరుకు మాత్రమే పార్టీలని, వీటికి భౌతికంగా ఎలాంటి కార్యాలయాలు అందుబాటులో లేవని ఈసీ వెల్లడించింది. ఇప్పటివరకు దేశంలో 2,854 గుర్తింపుపొందని పార్టీలను ఈసీ గుర్తించిందని చెప్పకొచ్చింది. తాజా చర్యతో ఆ సంఖ్య 2,520కి తగ్గిందని తెలిపారు. ఎన్నికల సంఘం వద్ద ఉన్న సమాచారం ప్రకారం.. ప్రస్తుతం దేశంలో ఆరు జాతీయ పార్టీలుగా.. 67 ప్రాంతీయ రాజకీయ పార్టీలుగా కొనసాగుతున్నాయని ఈసీ స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి
ఉద్యోగం పోయిన తర్వాత లోన్ EMIలు చెల్లించాలా? మారటోరియం?
బ్యాంక్ షాక్..ఇకపై మినిమం అకౌంట్ బ్యాలెన్స్ రూ.50 వేలకు పెంపు