Share News

BJP state chief: బీజేపీ రాష్ట్ర చీఫ్ శపథం.. ఆ కార్యాలయాన్ని కూల్చేదాకా వుంటా

ABN , Publish Date - Feb 14 , 2025 | 11:28 AM

పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా లేకపోయినా డీఎంకే ప్రధాన కార్యాలయమైన అన్నా అరివాలయం కూల్చివేసేంత వరకు తాను రాష్ట్రంలోనే ఉంటానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) శపథం చేశారు.

BJP state chief: బీజేపీ రాష్ట్ర చీఫ్ శపథం.. ఆ కార్యాలయాన్ని కూల్చేదాకా వుంటా

- బీజేపీ నేత అన్నామలై శపథం

- ఇలాంటివారు కాలగర్భంలో కలిసి పోయారు

- భగ్గుమన్న డీఎంకే నేతలు

చెన్నై: పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా లేకపోయినా డీఎంకే ప్రధాన కార్యాలయమైన అన్నా అరివాలయం కూల్చివేసేంత వరకు తాను రాష్ట్రంలోనే ఉంటానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) శపథం చేశారు. ఈ వ్యాఖ్యలపై డీఎంకే నేతలంతా మండిపడ్డారు. తిరువాన్మియూరులో కేంద్ర బడ్జెట్‌ అంశాలపై జరిగిన ప్రచార సభలో అన్నామలై మాట్లాడుతూ. 2026 ఎన్నికల తర్వాత అవినీతికి పాల్పడిన డీఎంకే నేతలంతా జైలుకెళ్లటాన్ని కూడా తాను కళ్ళారా చూస్తానన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: PM Modi: ఈ రోజు చాలా ముఖ్యమైనది!


nani1.2.jpg

సీఎం స్టాలిన్‌ వెళ్లే ప్రతిచోటా కేంద్ర బడ్జెట్‌ గురించే మాట్లాడుతున్నారని, డీఎంకే ఎంపీలు పార్లమెంట్‌లో నిధుల కోసం మాట్లాడకుండా ఇతర రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నారని, ఓ ఎంపీ పార్లమెంట్‌లో సంస్కృతంలో అనువాద పరికరాన్ని ఎందుకు ఏర్పాటు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేయటం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర గవర్నర్‌, తాను పదవుల్లోనే కొనసాగాలని కోరుకుంటానని సీఎం స్టాలిన్‌ యెద్దేవా చేయడం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు.


వారంతా మట్టికొట్టుకుపోయారు: ఆర్‌ఎస్‌ భారతి

బీజేపీ నేత అన్నామలై విమర్శలపై డీఎంకే వ్యవస్థాపక కార్యదర్శి ఆర్‌ఎస్‌ భారతి తీవ్రంగా ఖండించారు. గతంలో అరివాలయాన్ని కూల్చివేస్తామంటూ శపథాలు చేసిన నేతలంతా మట్టికొట్టుకుపోయారని, ఆ కోవలోనే అన్నామలై డీఎంకే ప్రధాన కార్యాలయం గురించి అనవసరంగా ప్రస్తావించారన్నారు. అరివాలయం అవినీతి సొమ్ముతో నిర్మించినది కాదని, పార్టీ కార్యకర్తలు, నేతలు, సామాన్య ప్రజలు ఇచ్చిన విరాళాలు, వారి శారీరీక శ్రమతో నిర్మించిన భవనం అనే విషయం అన్నామలైకి తెలిసే అవకాశం లేదన్నారు.


2026లోగా డీఎంకే మంత్రులంతా అవినీతి కేసుల్లో జైళ్లకు వెళతారంటూ జోస్యం చెబుతున్న అన్నామలై, 3026 వరకూ వేచి ఉన్నా ఆ జోస్యం ఫలించదన్నారు. డీఎంకేని నాశనం చేస్తామంటూ ప్రతిజ్ఞలు చేసినవారంతా పత్తాలేకుండా పోయారని తెలిపారు. అన్నామలై చేస్తున్న అనవసరమైన విమర్శలు డీఎంకే శ్రేణులలో ఉద్వేగం పెరుగుతుందనే విషయం ఆయన గుర్తుంచుకోవాలని ఆర్‌ఎస్‌ భారతి హితవు పలికారు. అరివాలయం చివరి ఇటుక తొలగించేంతవరకూ ఉంటానని చెబుతున్న అన్నామలై, ఆ భవనం వద్ద గడ్డి కూడా తొలగించలేరనే విషయం గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు.


అంతటి మగాడు పుట్టనేలేదు...

అరివాలయాన్ని, డీఎంకేని కూల్చే మగాడు ఇంకా పుట్టనేలేదని దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు(Minister PK Shekhar Babu) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఎన్నికల్లో పోటీ చేయని అన్నామలై డీఎంకే గురించి అనవసరమైన విమర్శలు చేయడం గర్హనీయమన్నారు. నగరంలో మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ... డీఎంకేని, అరివాలయాన్ని నాశనం చేస్తామంటూ శపథాలు చేసినవారంతా కాలగర్భంలో కలిసిపోయారని, ఆ కోవలోనే అన్నామలై అడ్రస్‌ లేకుండా పోవటం ఖాయమన్నారు. 75 యేళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన డీఎంకే కార్యాలయం అరివాలయాన్ని కదిలించే మగాడు ఇంకా పుట్టనే లేదన్నారు. 2026 ఎన్నికల్లో డీఎంకే భారీ మెజారిటీలో అధికారంలో వచ్చితీరుతుందని, ఆ తర్వాత అన్నామలై సహా బీజేపీ నేతలంతా మూటముల్లె సర్దుకుని ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లటం ఖాయమని శేఖర్‌బాబు జోష్యం చెప్పారు.


ఈవార్తను కూడా చదవండి: ప్రమాణాలు పాటించకుండా ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు ఆహార పదార్థాలు!

ఈవార్తను కూడా చదవండి: సంజయ్‌, కిషన్‌రెడ్డి.. కోతల రాయుళ్లు

ఈవార్తను కూడా చదవండి: ఎస్సీలలోని అన్ని కులాలకు తహసీల్దార్‌ ద్వారానే కుల ధ్రువీకరణ పత్రాలివ్వాలి

ఈవార్తను కూడా చదవండి: Mini Jatara.. మేడారంలో కొనసాగుతున్న మినీజాతర

Read Latest Telangana News and National News

Updated Date - Feb 14 , 2025 | 11:28 AM