Share News

Rekha Gupta: ఆ నియోజకవర్గం నుంచే బీజేపీ సీఎంలు

ABN , Publish Date - Feb 19 , 2025 | 08:55 PM

Rekha Gupta: ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖాగుప్తాను బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకొంది. దీంతో ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆమె షాలిమార్ బాగ్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇలా ఎమ్మెల్యేగా ఎన్నికై.. అలా ముఖ్యమంత్రి ఛాన్స్ కొట్టేశారు.

Rekha Gupta: ఆ నియోజకవర్గం నుంచే బీజేపీ సీఎంలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: ఎట్టకేలకు దేశ రాజధాని న్యూఢిల్లీ ముఖ్యమంత్రి పేరును బీజేపీ అగ్రనాయకత్వం ప్రకటించింది. న్యూఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా పేరును ఆ పార్టీ ప్రకటించింది.బుధవారం సాయంత్రం న్యూఢిల్లీలో బీజేపీ లేజిస్లేటివ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రేఖ గుప్తాను ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. అయితే ఆమె తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి.. సీఎం సీట్‌ జాక్ పాట్‌గా కొట్టేశారు. రేఖా గుప్తా.. షాలిమార్ బాగ్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

అయితే గతంలో ఇదే స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా సాహెబ్ సింగ్ వర్మ విజయం సాధించి.. ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. ఇక సాహెబ్ సింగ్ వర్మ కుమారుడే డిప్యూటీ సీఎం పర్వేష్ సింగ్ వర్మ. ఆయన సైతం న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించారు. దీంతో కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేష్ సింగ్‌కు ముఖ్యమంత్రి పీఠం దక్కుతోందని అంతా భావించారు. కానీ రేఖా గుప్తా పేరును బీజేపీ అనుహ్యంగా తెరపైకి తీసుకు వచ్చింది.


రేఖా గుప్తా పేరు ఎందుకు తెరపైకి వచ్చిందంటే..?

రేఖా గుప్తా.. షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1993లో షాలిమార్ బాగ్ అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పాటు అయింది. తొలిసారి ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా సాహెబ్ సింగ్ వర్మ బరిలో నిలిచి.. గెలిచారు. దీంతో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నాటి నుంచి ఆయన వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గం నుంచి గెలిచారు. అలా ఈ నియోజకవర్గం బీజేపీకి ఓ విధంగా కంచుకోట మారిపోయింది.

Also Read :టెక్నాలజీ అభివృద్ధి చెందినా.. ఏఐ వచ్చినా.. మనల్ని నడిపేది దేవుడే


అలా 2008 వరకు ఈ నియోజకవర్గం వరుసగా బీజేపీ అభ్యర్థులే గెలుపొందారు. అయితే ఢిల్లీ కేంద్రంగా అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ పురుడు పోసుకుంది. దీంతో ఈ నియోజకవర్గం ఆ పార్టీకి కంచుకోటగా మారిపోయింది. ఆ క్రమంలో 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రేఖా గుప్తా బరిలో దిగి.. ఆప్ అభ్యర్థి బందనా కుమారి చేతిలో వరుసగా ఓటమిపాలయ్యారు.

Also Read: సీన్ రీ కన్‌స్ట్రక్ట్ అవసరం లేదు.. ఎందుకంటే..?

Also Read: వాయిదా పడ్డ ఎమ్మెల్యేల శిక్షణ తరగతులు.. ఎందుకంటే..?


కానీ 2025లో జరిగిన ఎన్నికల్లో మాత్రం రేఖా గుప్తా ఘన విజయం సాధించారు. తద్వారా తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై.. ముఖ్యమంత్రి పీఠాన్ని ఆమె అందుకోనున్నారు. ఈ నియోజకవర్గానికి మొత్తం 8 సార్లు ఎన్నికలు జరగగా.. అందులో ఐదు సార్లు బీజేపీ, మూడుసార్లు ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించాయి. మరోవైపు.. రేఖాగుప్తా గతంలో బీజేపీ కార్పొరేటర్‌గా పలుమార్లు గెలుపొందారు. దీంతో కార్పొరేటర్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై.. తొలిసారి అసెంబ్లీలో ఆమె అడుగు పెట్టుబోతున్నారు.

Also Read: కొలిక్కి వస్తోన్న మదనపల్లి సబ్ కలెక్టరేట్‌లో ఫైల్స్ దగ్ధం కేసు


70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5వ తేదీన ఎన్నికల పోలింగ్‌ జరిగింది. ఈ ఎన్నికల ఫలితాలు.. ఫిబ్రవరి 8వ తేదీన వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో ఢిల్లీ ఓటరు.. బీజేపీకి పట్టం కట్టాడు. దీంతో ఆ పార్టీకి 48 స్థానాలను కైవసం చేసుకోగా.. ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం కేవలం 22 స్థానాలకు పరిమితమైంది. దాంతో దాదాపు మూడు దశాబ్దాల అనంతరం బీజేపీ మళ్లీ దేశ రాజధాని హస్తినలో పాగవేసినట్లు అయింది.

Also Read: ఏదో తేడాగా ఉంది

Also Read: జగన్‌కు దమ్ము లేదు


ఇంకోవైపు ఢిల్లీ సీఎం అభ్యర్థి ఎంపికకు ముందే.. సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఆ పార్టీ చేపట్టింది. అందుకోసం ముహూర్తం సైతం ఖరారు చేసింది. అలాగే సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు, అధినేతలు కార్యక్రమానికి హాజరుకానున్నారు.

For National News And Telugu News

Updated Date - Feb 19 , 2025 | 09:44 PM