Nara Lokesh: టెక్నాలజీ అభివృద్ధి చెందినా.. ఏఐ వచ్చినా.. మనల్ని నడిపేది దేవుడే
ABN , Publish Date - Feb 19 , 2025 | 07:46 PM
Nara Lokesh: టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిన.. ఏఐ వచ్చిన మనల్ని నడిపించేది మాత్రం దేవుడేనని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. బుధవారం తిరుపతి వేదికగా ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పోలో ఆయన పాల్గొన్నారు. పిల్లలకు ఫోన్లు, ఐపాడ్‌లు ఇచ్చి పుస్తకాలకు దూరం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తన కుమారుడు దేవాన్ష్‌కు మాత్రం సెల్ ఫోన్ ఇవ్వడం లేదని.. దేవుడు పుస్తకాలు ఇస్తున్నామని తెలిపారు.
తిరుపతి, ఫిబ్రవరి 19: టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా.. ఏఐ వచ్చినా మనల్ని నడిపేది మాత్రం దేవుడేనని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. తిరుపతి వేదికగా జరుగుతోన్న ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పోలో బుధవారం మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తిరుమలలో అన్నదానం ప్రారంభించారని.. సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రాణ దానము ప్రారంభించారని గుర్తు చేశారు.
పిల్లలకు ఫోన్లు ఐపాడ్‌లు ఇచ్చి పుస్తకాలకు దూరం చేస్తున్నామని ఈ సందర్బంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తన కుమారుడు దేవాన్ష్‌కు మాత్రం సెల్ ఫోన్ ఇవ్వడం లేదని.. దేవుడు పుస్తకాలు ఇస్తున్నామన్నారు. మన దేవుళ్ల గురించి మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందని స్పష్టం చేశారు. దేశ ప్రధాని వసుదైక కుటుంబం గురించి ఇచ్చిన పిలుపు ఆదర్శప్రాయమైనదని అభివర్ణించారు. అందరూ కలిసి మన సంస్కృతిని కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొ్న్నారు.
అయితే వాట్సప్ ద్వారా ఆలయాల్లో సేవలు పొందేలా ఏపీలో సేవలు ప్రారంభించామని మంత్రి నారా లోకేష్ వివరించారు. ఇక ఆలయాలు, ఆలయాల్లో పని చేసే ఉద్యోగుల జీవితాల్లో వెలుగుల కోసం చంద్రబాబు నాయుడు అనేక చర్యలు చేపట్టారన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న దేవాదాయ శాఖ మంత్రుల సమావేశంలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. ఆలయాల ఉన్నతి కోసం ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవాలన్నారు.
Also Read: సీన్ రీ కన్‌స్ట్రక్ట్ అవసరం లేదు.. ఎందుకంటే..?
Also Read: కొలిక్కి వస్తోన్న మదనపల్లి సబ్ కలెక్టరేట్‌లో ఫైల్స్ దగ్ధం కేసు
అలాగే తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు బారులు తీరకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తిరుమలలో టికెట్ బుకింగ్, ఆలయ సర్వీసులు మరింత సరళతరం చేస్తామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయని, భక్తులను ఆలయాలకు మరింత చేరువ చేసే దిశగా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.
Also Read: ఏదో తేడాగా ఉంది
Also Read: జగన్‌కు దమ్ము లేదు
డ్రోన్లు, ఏఐ వినియోగం ద్వారా భక్తుల రద్దీ నియంత్రణకు చర్యలు తీసుకుంటామన్నారు. తిరుపతి ఘటన దృష్ట్యా భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారని తెలిపారు. ఈ ఎక్స్‌పోలో భాగంగా నిపుణుల మధ్య ఆలయాలపై చర్చలు, వర్క్‌షాపులు నిర్వహించారు.
Also Read: వాయిదా పడ్డ ఎమ్మెల్యేల శిక్షణ తరగతులు.. ఎందుకంటే..?
మరోవైపు మంత్రి నారా లోకేష్ తిరుపతిలో బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం ప్రారంభించారు. అనంతరం విద్యార్థినులతో నారా లోకేష్ ముఖా ముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే పార్టీ కార్యకర్తలతో సైతం ఆయన సమావేశమయ్యారు.
For AndhraPradesh News And Telugu News