Amit Shah:2026 మార్చి 31 నాటికి నక్సలిజం నుంచి విముక్తి
ABN , Publish Date - Feb 09 , 2025 | 04:53 PM
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌ను భద్రతా బలగాల భారీ సక్సెస్‌గా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సామాజిక మాధ్యమంలో అభినందించారు.

న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురెదురు కాల్పుల్లో 31 మంది మావోయిస్టులు ఆదివారంనాడు మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్ చరిత్రలోనే రెండో భారీ ఎన్‌కౌంటర్‌గా దీనిని చెబుతున్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి భారీ ఆయుధాలు, పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌ను భద్రతా బలగాల భారీ సక్సె్స్‌గా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) సామాజిక మాధ్యమంలో అభినందించారు.
Chhattisgarh: దండకారణ్యంలో ఎన్‌కౌంటర్.. మావోయిస్టులకు భారీ దెబ్బ
''నక్సలైట్ల నుంచి దేశానికి విముక్తి కలిగించే దిశగా బిజాపూర్‌లో భద్రతా బలగాలు భారీ సక్సెస్ సాధించారు. ఈ ఆపరేషన్‌లో 31 మంది నక్సల్స్‌ను బలగాలు మట్టుబెట్టాయి. భారీగా ఆయుధాలు, పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు'' అని అమిత్‌షా పేర్కొన్నారు. నక్సలిజం అంతానికి చేపట్టిన ఈ ఆపరేషన్‌లో ఇద్దరు సాహస జవాన్లు ప్రాణాలు కోల్పోయారనీ, దేశం కోశం ప్రాణాలర్పించిన ఈ త్యాగధనులను దేశం మరువదని చెప్పారు. జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, నక్సలిజం కారణంగా ఒక్క పౌరుడు కూడా ప్రాణాలు కోల్పోరాదని అన్నారు.
బస్తర్ పోలీసు అధికారుల సమాచారం ప్రకారం, ఆదివారం ఉదయం బిజాపూర్ అడవుల్లో ఎన్‌కౌంటర్ మొదలైంది. 31 మంది నక్సల్స్‌ను మట్టుబెట్టినట్టు బస్తర్ ఐజీ పి.సుందరరాజ్ తెలిపారు. ఒక జిల్లా రిజర్వ్ గార్డు, టాస్క్ ఫోర్స్‌కు చెందిన మరో జవాను మృతి చెందారని, మరో ఇద్దరు గాయపడ్డారని చెప్పారు. మృతిచెందిన నక్సల్స్‌ను గుర్తించే ప్రయత్నాలు చేస్తు్న్నామన్నారు. కాగా, 31 మంది నక్సల్‌ను జవాన్లు మట్టుబెట్టినట్టు ఛత్తీస్‌గఢ్ సీఎం అరుణ్ సావో ధ్రువీకరించారు. సాహజ జవాన్లకు అభినందనలు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు జవాన్లకు నివాళులర్పిస్తున్నామని అన్నారు.2026 నాటికి నక్సల్ విముక్తి భారతానికి మోదీ, అమిత్‌షా చేస్తున్న కృషిలో ఇదొక ముందడుగని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
Delhi: సీఎం రేసులో ఆ ముగ్గురు... మహిళలు, ఎంపీల పేర్లు సైతం పరిశీలనలో
Delhi CM: ఢిల్లీ సీఎం అతిషి రాజీనామా.. అసెంబ్లీ రద్దు
Delhi CM: ఐదేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రులు.. ఢిల్లీని బీజేపీ పాలించినపుడు ఏం జరిగిందంటే..
For More National News and Telugu News..