Share News

Delhi: సీఎం రేసులో ఆ ముగ్గురు... మహిళలు, ఎంపీల పేర్లు సైతం పరిశీలనలో

ABN , Publish Date - Feb 09 , 2025 | 04:10 PM

కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ కేంద్ర నాయకత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో సీఎం రేసులో ముగ్గురు నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తు్న్నాయి. ఈ ముగ్గురిలో పర్వేష్ వర్మ ముందున్నారు.

Delhi: సీఎం రేసులో ఆ ముగ్గురు... మహిళలు, ఎంపీల పేర్లు సైతం పరిశీలనలో

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించడంతో పార్టీ అధిష్ఠానం ఎవరిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తుందనే ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి ప్రజలు ఉద్వాసన చెప్పి బీజేపీని 70 సీట్లలో 48 సీట్లు గెలిపించారు. ఆప్ కేవలం 22 సీట్లకే పరిమితమైంది.

Delhi Election Results: గెలుపు ఉద్వేగం.. కంటతడి పెట్టిన బీజేపీ ఎమ్మెల్యే


సీఎం రేసులో ముగ్గురు

కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ కేంద్ర నాయకత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో సీఎం రేసులో ముగ్గురు నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తు్న్నాయి. ఈ ముగ్గురిలో పర్వేష్ వర్మ ముందున్నారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి దివంగత సాహిబ్ సింగ్ వర్మ కుమారుడైన పర్వేష్ వర్మ న్యూ ఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అరవింద్ కేజ్రీవాల్‌పై గెలిచారు. పార్టీ సీనియర్ నేతలందరితోనూ ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయని, హిందుత్వ వాదాన్ని బలంగా వినిపిస్తుంటారని ఆయనకు పేరుంది. అయితే, బీజేపీ ఢిల్లీ విభాగం సీనియర్ నేతలు పలువురు కూడా ఈసారి ఎన్నికల్లో గెలుపొందారు. దీంతో మరికొందరు కూడా సీఎం పదవిని ఆశిస్తున్నారు.


ఆశిష్ సూద్, పవన్ శర్మ

సీనియర్ నేతలు ఆశిష్ సూద్, పవన్ శర్మ కూడా సీఎం రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. ఆశిష్ సూద్ బీజేపీ రాష్ట్ర విభాగం మాజీ సెక్రటరీ జనరల్ (ఆర్గనైజేషన్)గా పనిచేశారు. జనక్‌పురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన 68,986 ఓట్ల ఆధిక్యంతో ఈ ఎన్నికల్లో గెలుపొందారు. బీజేపీ హయాంలో సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాల్లో గట్టి అనుభవం సాధించారని చెబుతున్నారు. గోవాకు బీజేపీ ఇన్‌చార్జిగా, జమ్మూ కశ్మీర్ యూనిట్ కో-ఇన్‌చార్జిగా ఆయన ఉన్నారు. కాగా, ఉత్తమ్ నగర్ నియోజకవర్గం నుంచి పవన్ శర్మ పోటీ చేసి 1,03,613 ఓట్ల ఆధిక్యంతో భారీ విజయం సాధించారు. బీజేపీ అసోం కో-ఇన్‌చార్జిగా ఆయన ఉన్నారు. సీఎం రేసులో శర్మ కూడా ఉన్నట్టు పార్టీ నేతలు తెలిపారు.


ఇతర నేతల్లో...

కాగా సీఎం పదవిని చేపట్టేందుకు అవకాశం ఉన్న సీనియర్ నేతల్లో ఢిల్లీ బీజేపీ మాజీ అధ్యక్షులు విజేంద్ర గుప్తా, సతీష్ ఉపాధ్యాయ్ ఉన్నారు. రోహిణి నియోజకవర్గం నుంచి విజేంద్ర గుప్తా 37,000 ఓట్లతో హ్యాట్రిక్ గెలుపుసాధించారు. గత ఢిల్లీ అసెంబ్లీలో విపక్ష నేతగా పనిచేశారు. సతీష్ ఉపాధ్యాయ్ న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్‌డీఎంసీ) వైస్‌చైర్మన్‌గా ఉన్నారు. ఆయన మాలవీయ నగర్ నియోజకవర్గం నుంచి 39,000 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఆర్ఎస్ఎస్‌తో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. పార్టీ మధ్యప్రదేశ్ యూనిట్ కో-ఇన్‌చార్జిగా కూడా ఉపాధ్యాయ్ ఉన్నారు.


మహిళా అభ్యర్థులు

మహిళా అభ్యర్థులకు ముఖ్యమంత్రిగా బీజేపీ అధిష్ఠానం ప్రాధాన్యత ఇచ్చినట్లయితే పలువురు పరిశీలనకు వచ్చే అవకాశాలున్నట్టు చెబుతున్నారు. వీరిలో షిఖా రాయ్ ఒకరు. ఆప్ కీలక నేత సౌరభ్ భరద్వాజ్‌పై గ్రేటర్ కైలాస్ నియోజకవర్గం నుంచి 3,188 ఓట్ల ఆధిక్యంతో ఆయన గెలిచారు. రేఖా గుప్తా పేరు కూడా ప్రచారంలో ఉంది. షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థి బండన కుమారిపై 29,000 ఓట్ల ఆధిక్యంతో రేఖా గుప్తా గెలుపొందారు.


ఎంపీలకు అవకాశమిస్తే..

కాగా, ఎమ్మెల్యేలు కాకుండా ఇతరుల వైపు బీజేపీ అధిష్ఠానం మొగ్గుచూపితే సీఎం పదవికి కొందరు ఎంపీల పేర్లు పరిశీలించే అవకాశం ఉంది. వీరిలో ఈస్ట్ ఢిల్లీ ఎంపీ, కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా, నార్త్ ఈస్త్ ఢిల్లీ ఎంపీ, పూర్వాంచల్ నేత మనోజ్ తివారి పేరు పరిశీలించవచ్చు.


ఇవి కూడా చదవండి..

Delhi CM: ఢిల్లీ సీఎం అతిషి రాజీనామా.. అసెంబ్లీ రద్దు

Delhi CM: ఐదేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రులు.. ఢిల్లీని బీజేపీ పాలించినపుడు ఏం జరిగిందంటే..

For More National News and Telugu News..

Updated Date - Feb 09 , 2025 | 04:10 PM