Delhi Election Results: గెలుపు ఉద్వేగం.. కంటతడి పెట్టిన బీజేపీ ఎమ్మెల్యే
ABN , Publish Date - Feb 09 , 2025 | 02:55 PM
ఆదర్శ్ నగర్ నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థి ముఖేష్ గోయల్‌పై 11,452 ఓట్ల ఆధిక్యంతో రాజ్‌కుమార్ భాటియా గెలిచారు. ముఖేష్ గోయెల్‌కు 41,028 ఓట్లు రాగా, భాటియా 52,510 ఓట్లు సాధించారు.

న్యూఢిల్లీ: ఓటమే కాదు, గెలుపు కూడా ఒక్కోసారి కంతటడి పెట్టిస్తుంది. భావోద్యేగంతో కొందరు తడిసి ముద్దవుతుంటారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆదర్శ్ నగర్ నుంచి విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి రాజ్‌కుమార్ భాటియా (Raj kumar Bhatia) తన గెలుపుపై మాట్లాడుతూ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. ప్రజలు తన ముఖం చూసి కాదు, చేసిన పనులు చేసి ఓటేశారని, 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిందని చెబుతున్నప్పుడు ఆయన కళ్లు చెమ్మగిల్లాయి.
Delhi Election: విజయం లేదు.. ప్రభావం మాత్రం ఉంది.. ఢిల్లీ ఎలక్షన్లలో మజ్లీస్ ఏం చేసింది..?
ఆదర్శ్ నగర్ నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థి ముఖేష్ గోయల్‌పై 11,452 ఓట్ల ఆధిక్యంతో రాజ్‌కుమార్ భాటియా గెలిచారు. ముఖేష్ గోయెల్‌కు 41,028 ఓట్లు రాగా, భాటియా 52,510 ఓట్లు సాధించారు. రాజ్‌కుమార్ భాటియా 2020 ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి పవన్ శర్మపై కేవలం 1,500 ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో ఈసారి గెలుపు కోసం ఆయన పట్టుదలగా పనిచేశారు. పార్టీ అనుసరించిన వ్యూహాన్ని ఆయన వివరిస్తూ, తాము ప్రతి మురికివాడకు వెళ్లామని, అన్ని వర్గాల వారిని కలిశామని, ప్రధాని రాసిన లేఖను ప్రతి ఒక్కరికి చేరవేశారమని చెప్పారు. మోదీ పథకాలు వారికి వివరించి, ఇవి కేవలం వాగ్దానాలు కాదని, అమలు చేసి తీరుతామని తెలియజేశామని చెప్పారు. ఈ విజయాన్ని మోదీ విజయంగా ఆయన అభివర్ణించారు.
కొత్త సీఎం ఎవరు?
కాబోయే ముఖ్యమంత్రి ఎవరని అడిగినప్పుడు దీనిపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ''నా మనసులో కూడా ఒక పేరు ఉంది. అది కాన్ఫిడెన్షియల్. అధిష్ఠానం ముందు మాత్రమే చెబుతాను. సీఎం కావాలనే కోరిక నాకు లేదు. ఎమ్మెల్యేలతో సమావేశానంతరం పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది'' అని తెలిపారు. శనివారంనాడు వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఆప్ ఘోరంగా దెబ్బతింది. గతంలో 62 స్థానాలుండగా అది 22 స్థానాలకు పడిపోయింది. ఇంతకుముందు 8 స్థానాల్లో గెలిచిన బీజేపీ 48 స్థానాలు గెలుచుకుని సత్తా చాటుకుంది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగగమైంది.
ఇవి కూడా చదవండి..
Delhi CM: ఢిల్లీ సీఎం అతిషి రాజీనామా.. అసెంబ్లీ రద్దు
Delhi CM: ఐదేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రులు.. ఢిల్లీని బీజేపీ పాలించినపుడు ఏం జరిగిందంటే..
For More National News and Telugu News..