Delhi Election: విజయం లేదు.. ప్రభావం మాత్రం ఉంది.. ఢిల్లీ ఎలక్షన్లలో మజ్లీస్ ఏం చేసింది..?
ABN , Publish Date - Feb 09 , 2025 | 02:05 PM
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ చేతులు కలపకపోవడం వల్ల బీజేపీ లాభపడిందని చాలా మంది విశ్లేషణల చేస్తున్నారు. ఈ ఒక్క అంశమే కాదు.. హైదరాబాద్ ఫ్యాక్టర్ కూడా ఢిల్లీ ఎన్నికల్లో ప్రభావం చూపిందని కొందరు అంచనా వేస్తున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో మజ్లీస్ పార్టీ కూడా పోటీ చేసింది.

ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పరిచేందుకు సిద్ధమవుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ చేతులు కలపకపోవడం వల్ల బీజేపీ (BJP) లాభపడిందని చాలా మంది విశ్లేషణల చేస్తున్నారు. ఈ ఒక్క అంశమే కాదు.. హైదరాబాద్ ఫ్యాక్టర్ కూడా ఢిల్లీ ఎన్నికల్లో ప్రభావం చూపిందని కొందరు అంచనా వేస్తున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో మజ్లీస్ పార్టీ (AIMIM) కూడా పోటీ చేసింది. ఇద్దరు అభ్యర్థులను మజ్లీస్ నిలబెట్టింది ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. కానీ, మజ్లీస్ చేసిన పని బీజేపీ విజయానికి దోహదం చేసింది (Delhi election).
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓఖ్లా అసెంబ్లీ స్థానం నుంచి షిఫా ఉర్ రెహమాన్ ఖాన్, ముస్తఫాబాద్ నియోజకవర్గం నుంచి తాహిర్ హుస్సేన్‌ను మజ్లీస్ పార్టీ నిలబెట్టింది. ఈ ఇద్దరూ 2020 ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన కేసుల్లో నిందితులు. ప్రస్తుతం వారిద్దరూ జైల్లో కూడా ఉన్నారు. ఓఖ్లాలో ఆప్ నాయకుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ 23,639 ఓట్లతో గెలిచారు. బీజేపీకి చెందిన మనీష్ చౌదరి రెండో స్థానంలో నిలిచారు. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న షిఫా ఉర్ రెహమాన్ ఖాన్ 39, 558 ఓట్లు సాధించి మూడో స్థానం సాధించారు. కాంగ్రెస్ నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.
దాదాపు 40 శాతం ముస్లిం జనాభా ఉన్న ముస్తఫాబాద్ నియోజకవర్గంలో మజ్లీస్ అభ్యర్థిని పోటీకి దింపడం మాత్రం కచ్చితంగా బీజేపీకి కలిసి వచ్చింది. ఈ నియోజకవర్గంలో బీజేపీకి చెందిన మోహన్ సింగ్ బిష్ట్ 17,578 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. ఆప్ అభ్యర్థి అదీల్ అహ్మద్ ఖాన్ 67,637 ఓట్లు సాధించారు. మజ్లీస్‌కు చెందిన తాహిర్ హుస్సేన్ 33,474 ఓట్లు దక్కించుకున్నారు. మైనారిటీ ఓట్లు మూడు పార్టీల మధ్య చీలడంతో బీజేపీ అభ్యర్థికి మేలు జరిగింది.
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..