6 PM TOP 10 NEWS: టాప్ టెన్ వార్తలు ఇవే..
ABN , Publish Date - Jan 04 , 2025 | 06:03 PM
6 PM TOP 10 NEWS: శనివారం సాయంత్రం వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా చోటు చేసుకున్న కీలక పరిణామాల్లో ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన టాప్ 10 వార్తలు మీకోసం.. ఆ వార్తలను ఇక్కడ చూడొచ్చు

1) నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్.. అసలు విషయం ఏమిటంటే
సినీ నటుడు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఏ11గా ఉన్న అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో పూచీకత్తు సమర్పించేందుకు, మేజిస్ట్రేట్ ముందు కొన్ని పత్రాలపై సంతకాలు చేసేందుకు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. అల్లు అర్జున్ వెంట ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
2) వాష్ రూంలో కెమెరాలు.. మరోసారి కలకలం
విద్యాలయాలకు విద్యార్థినులు వెళ్లాలంటనే జంకుతున్నారు. పాఠశాలల్లో చదువుకునే బాలికల బాత్రూంలో మొబైల్ కెమెరాలు ఉన్నాయని ఈ మధ్య తరుచుగా వార్తలు వస్తున్నాయి. దీంతో బాలికల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. విద్యాలయాలకు బాలికలను పంపించాలంటేనే భయపడిపోతున్నారు. తెలంగాణలో ఈ మధ్య వరుసగా ఇలాంటి ఘటనలు బయట పడుతుండటంతో విద్యార్థినులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
3) తెలంగాణ ప్రజాప్రతినిధులకు నోటీసులు జారీ.. విషయం ఇదే..
ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ (Adarshnagar MLA Quarters)లో నివాసం ఉంటున్న ప్రజాప్రతినిధులకు తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) అధికారులు నోటీసులు ఇచ్చారు. క్వార్టర్స్ ఖాళీ చేయాలంటూ నోటీసులు జారీ చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు హైదర్‌గూడ (Hyderguda)లోని కొత్త క్వార్టర్స్ కేటాయిస్తామని అధికారులు వెల్లడించారు. ఇప్పుడున్న క్వార్టర్స్ ప్రాంతంలో కాన్‌స్టి్ట్యూషనల్ క్లబ్ నిర్మించబోతున్నట్లు, అందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
4) చిత్తూరులో సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఖరారు..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu naidu) చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు చంద్రబాబు జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 6 నుంచి 8 వరకు చిత్తూరు జిల్లాలో సీఎం పర్యటన సాగనుంది. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అలాగే డ్వాక్రా సంఘాలతో సమావేశంకానున్నారు. పలు ప్రారంభోత్సవాలు, యువతతో సమావేశాలు నిర్వహించనున్నారు సీఎం. ఈనెల 6న మధ్యాహ్నం 12 గంటలకు ద్రవీడియన్ యూనివర్సిటీలో స్వర్ణ కుప్పం విజన్ 2029 కార్యక్రమంలో పాల్గొననున్నారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
5) గంజాయి రవాణాపై ఉక్కుపాదం
గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపాలని పోలీసులను హోం మంత్రి వంగలపూడి అనిత (Minister Anitha) ఆదేశించారు. సబ్బవరం పోలీస్ స్టేషన్‌లో ఆకస్మికంగా హోం మంత్రి వంగలపూడి అనిత ఇవాళ(శనివారం) తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్‌లో సీసీ కెమెరాల నిర్వహణపై వివరాలు అడిగి హోం మంత్రి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించి, రౌడీ షీటర్ల వివరాలపై ఆరా తీశారు. రోడ్డు ప్రమాదాలపై దృష్టి సారించాలని పోలీసులకు హోం మంత్రి అనిత సూచించారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
6) కేజ్రీవాల్ మరో కీలక హామీ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), బీజేపీ (BJP) మధ్య రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బీజేపీ కేవలం ప్రతికూల విమర్శలు, ఇతరులను అవమానించడం ద్వారా మాత్రమే ఎన్నికల్లో గెలవాలనుకుంటోందని, ఆప్ మాత్రం పదేళ్లు చేసిన పనుల ఆధారంగా ఓట్లు కోరుతోందని ఆప్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అన్నారు. ఢిల్లీ వాసులు తప్పుడు నీటి బిల్లులు వస్తే వాటిని కట్టవద్దని, ఆప్ ప్రభుత్వం 2025లో తిరిగి అధికారంలోకి రాగానే ఆ బిల్లులను రద్దు చేస్తుందని ఆయన మరో కీలక హామీ ఇచ్చారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
7) మణిపూర్‌లో తాజా అల్లర్లు.. బాధ్యత నుంచి మోదీ తప్పించుకోలేరన్న ఖర్గే
మణిపూర్ (Manipur) నిరంతరం హింసాత్మక ఘటనలతో రగులుతుండటం వెనుక బీజేపీకి స్వప్రయోజనాలు ఉన్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజధర్మాన్ని పాటించనందున రాజ్యాంగపరమైన తప్పిదం నుంచి ఆయన తప్పించుకోలేరని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు. ''సరిహద్దు రాష్ట్రం నిరంతరం రగులుతూ ఉండేలా చేయడంలో బీజేపీకి ఏవో స్వప్రయోజనాలు ఉన్నాయి. బీజేపీ మ్యాచ్‌స్టిక్‌తో మణిపూర్ రగులుతోంది'' అని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఖర్గే ఆరోపించారు. మణిపూర్‌లో తాజా హింసాత్మక ఘటనకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను కూడా ఆయన షేర్ చేశారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
8) సిప్ పెట్టుబడుల మ్యాజిక్.. ఇలా రూ. 7 కోట్లు పొందండి..
ఇటివల కాలంలో సాధారణ ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్లలో భారీ మొత్తంలో మదుపు చేస్తున్నారు. మ్యూచువల్ ఫండ్ SIP దీర్ఘకాలిక పెట్టుబడి కోసం ఒక మంచి సాధనంగా ఉపయోగపడుతుంది. ఈ క్రమంలో వారు ఎంచుకున్న మొత్తాన్ని బట్టి పెట్టుబడి ఉంటుంది. ఈ నేపథ్యంలో మీరు 7 కోట్ల రూపాయల లక్ష్యాన్ని పెట్టుకుంటే (Investment Tips) నెలకు ఎంత పెట్టుబడి చేయాలి, ఎన్నేళ్లు చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
9) ఇలా బతకడం కష్టం.. తాజా ఇన్‌స్టా పోస్ట్‌లో రకుల్
కొన్ని నెలల క్రితం జిమ్‌లో బరువులెత్తుతూ గాయపడిన నటి రకుల్ ప్రీత్‌సింగ్ రెస్ట్ తర్వాత భర్త జాకీ భగ్నానీతో కలిసి లండన్, పారిస్‌లో కొత్త సంవత్సరాన్ని ఆస్వాదిస్తోంది. చాన్నాళ్ల నుంచి గాయం కారణంగా షూటింగ్‌లకు దూరంగా ఉన్న రకుల్.. ఇన్‌స్టా వీడియోల ద్వారా అభిమానులకు టచ్‌లోనే ఉంది. ఎప్పటికప్పుడు తన ఆరోగ్య పరిస్థితిపై అప్‌డేట్‍లు ఇస్తూ విభిన్న అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడిస్తోంది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
10) టీమిండియా గేమ్ ఓవర్.. రాజు లేని రాజ్యం అయిపోయింది..
15 ఏళ్ల నుంచి జట్టుతో ట్రావెల్ అవుతున్నాడు. టన్నుల కొద్దీ పరుగులు, సెంచరీల మీద సెంచరీలు బాదాడు. ఊహించని విజయాలు అందించాడు. ఏకంగా వరల్డ్ కప్ ట్రోఫీనే తీసుకొచ్చాడు. కానీ అతడికి ఆఖరుకు అవమానమే మిగిలింది. ఫామ్‌లో లేడని టీమ్ నుంచి డ్రాప్ చేసేశారు. మనం మాట్లాడుకుంటోంది మరెవరి గురించో కాదు.. భారత జట్టు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గురించేనని అర్థమయ్యే ఉంటుంది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి