Hyderabad: తెలంగాణ ప్రజాప్రతినిధులకు నోటీసులు జారీ.. విషయం ఇదే..
ABN , Publish Date - Jan 04 , 2025 | 02:00 PM
తెలంగాణ: ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్(Adarshnagar MLA quarters)లో నివాసం ఉంటున్న ప్రజాప్రతినిధులకు తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) అధికారులు నోటీసులు ఇచ్చారు.

హైదరాబాద్: ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ (Adarshnagar MLA Quarters)లో నివాసం ఉంటున్న ప్రజాప్రతినిధులకు తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) అధికారులు నోటీసులు ఇచ్చారు. క్వార్టర్స్ ఖాళీ చేయాలంటూ నోటీసులు జారీ చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు హైదర్‌గూడ (Hyderguda)లోని కొత్త క్వార్టర్స్ కేటాయిస్తామని అధికారులు వెల్లడించారు. ఇప్పుడున్న క్వార్టర్స్ ప్రాంతంలో కాన్‌స్టి్ట్యూషనల్ క్లబ్ నిర్మించబోతున్నట్లు, అందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu), మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav), మాజీ ఎంపీ అంజనీ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ సహా అన్ని క్వార్టర్స్‌కు నోటీసులు ఇచ్చారు. ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు క్వార్టర్స్‌లో ఉన్న పలు షాపులకు సైతం అధికారులు నోటీసులు జారీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Medchal: ప్రియురాలి కోసం యువకుల మధ్య ఘర్షణ.. చివరికి ఏమైందంటే..
TG News: పేలిన రియాక్టర్..ఒకరి మృతి.. పరుగులు తీసిన కార్మికులు